ETV Bharat / bharat

స్టార్​ హోటల్​ సిబ్బంది 'నిర్బంధం'- కరోనానే కారణం - corona latest news

కరోనా భయంతో దిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్​ తమ సిబ్బందిని 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరింది. తమ ఆధీనంలోని ఓ రెస్టారెంట్​లో కరోనా సోకిన వ్యక్తి భోజనం చేసినందున ఈ నిర్ణయం తీసుకుంది.

Luxury hotel sends its restaurant staff on self-quarantine after COVID-19 scare
స్టార్​ హోటల్​ సిబ్బంది 'నిర్బంధం'- కరోనానే కారణం
author img

By

Published : Mar 3, 2020, 7:24 PM IST

దేశ రాజధాని దిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్ హయత్​ రిజెన్సీ​కి చెందిన లా పియాజ్జా రెస్టారెంట్​ సిబ్బందిపై కరోనా ఎఫెక్ట్​ పడింది. సదరు రెస్టారెంట్​లో ఫిబ్రవరి 28న భోజనం చేసిన వ్యక్తికి సోమవారమే కరోనా వైరస్​ పాజిటివ్​గా తేలినందున.. సిబ్బంది మొత్తం రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని యాజమాన్యం కోరింది.

" గతనెల 28న లా పియాజ్జా రెస్టారెంట్​లో డిన్నర్​ చేసిన వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రభుత్వాధాకారులు ధ్రువీకరించారు. అందుకే ఆ రోజున రెస్టారెంట్​లో విధుల్లో ఉన్న వారందరూ 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరాం. హయత్​ రిజెన్సీ దిల్లీలోని సిబ్బందితో పాటు హోటల్​లోకి వచ్చే వారికి రోజూ ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నాం."

- జూలియన్​ ఆయెర్స్​, హయత్​ రిజెన్సీ దిల్లీ జనరల్​ మేనేజర్​

ఇద్దరు భారతీయులకు వైరస్​ సోకినట్టు సోమవారం నిర్ధరణ అయ్యింది. వీరిలో 45ఏళ్ల దిల్లీవాసి ఒకరు. ఆయనే గతనెల 28న పియాజ్జా రెస్టారెంట్​లో డిన్నర్​ చేశారు. ఆ తర్వాత ఆగ్రాలోని అతని బంధువులను కలిసినందున ప్రస్తుతం వీరికి కూడా కోరానా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : దేశంలో మరో ఆరుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.