ETV Bharat / bharat

'పోలీసులే దుప్పట్లు ఎత్తుకెళ్లారు'

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్​లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత మంది మహిళలు కలిసి లఖ్​నవూలోని ఘంటాఘర్ పార్క్​ ప్రాంతంలో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు తమ దగ్గరున్న దుప్పట్లను బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆరోపించారు మహిళలు.

Lucknow anti-CAA protests: Policemen accused of taking away blankets, deny charge
సీఏఏ నిరసన: దుప్పట్లు ఎత్తుకెళ్లారని పోలీసులపై ఆరోపణ
author img

By

Published : Jan 19, 2020, 7:01 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్ రాజధాని లఖ్​నవూలోని ఘంటాఘర్ పార్క్​ వద్ద దాదాపు 50 మంది మహిళలు తమ పిల్లలతో సహా నిరసనలు చేపట్టారు. సీఏఏ, జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ)లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తున్న క్రమంలో మహిళలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే.. వారికి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన దుప్పట్లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపిస్తున్నారు పలువురు మహిళలు. మరోవైపు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు లఖ్​నవూ పోలీసులు. అసత్యాలు ప్రచారం చేయోద్దని సూచించారు.

"లఖ్​నవూలోని ఘంటాఘర్ పార్క్​ వద్ద అక్రమ నిరసనలు జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, తాళ్లతో కలిపి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఇలా చేయడం నిషేధం. కొన్ని సంస్థలు పార్క్ పరిసరాలలో దుప్పట్లను పంపిణీ చేస్తున్నాయి. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు కూడా దుప్పట్లను తీసుకోవడానికి పార్క్​కు వచ్చారు. దుప్పట్లు పంపిణీ చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించి, వారిపై చర్యలు తీసుకున్నాం."-లఖ్​నవూ పోలీస్ ట్వీట్​

ఈ నేపథ్యంలో పోలీసులు దుప్పట్లను తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. దుప్పట్లు తీసుకెళ్తున్న సమయంలో మహిళలు పోలీసులను దొంగ అంటూ నినాదాలు చేశారు.

పోలీసులు దుప్పట్లు తీసుకెళ్తున్న దృశ్యాలు

ఇదీ చదవండి: హైదరాబాద్​లో స్వైన్​ఫ్లూ కలకలం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.