రుణాల ఎగవేత, దివాలా స్మృతి చట్టం సవరణకు పార్లమెంటు ఆమోదం లభించింది. మూడేళ్ల నాటి దివాలా చట్టం సవరణలను లోక్సభలో నేడు సభ్యులు ఆమోదించారు. ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలో నెగ్గింది.
కొన్ని సెక్షన్లు మినహా చట్టం స్ఫూర్తిని మార్చబోవటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివాలా తీసిన కంపెనీలను కాపాడే ప్రయత్నం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
"కంపెనీలను నిర్వీర్యం చేయటం ఈ బిల్లు ఎజెండా కాదు. ఏడు సెక్షన్లను సవరిస్తున్నాం. ఒకసారి కార్పొరేట్ దివాలా ప్రక్రియ ప్రారంభం అయితే 330 రోజుల్లోనే అంతా పూర్తవుతుంది."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి: దివాలా చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం