ETV Bharat / bharat

ఇక ఒకే పీపీఈ కిట్​ను మళ్లీమళ్లీ వాడొచ్చు! - Reusable PPE first produced by loyal textiles

కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనప్పటినుంచి.. మానవాళి కాలు బయటపెట్టాలంటేనే వణికిపోతుంది. ఎన్ని శానిటైజర్లు, మాస్కులు ధరించినా.. మహమ్మారి ఎక్కడి నుంచి దాపరిస్తుందో తెలియక భయం కలుగుతోంది. పోనీ వైద్యుల మాదిరి తల నుంచి కాలి వేలి వరకు కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరిద్దామంటే.. రోజుకో కిట్​ ఎక్కడి నుంచి తెస్తాం? అయితే, ఇకపై ఆ టెన్షన్​ అక్కర్లేదు. ఒక్క పీపీఈ ఉంటే చాలు దానినే మళ్లీ మళ్లీ ఉపయోగించొచ్చు. అవును, ప్రపంచంలోనే తొలిసారిగా రీయూసబుల్​ పీపీఈ కిట్లను విడుదల చేసేసింది లాయల్​ టెక్స్​టైల్​ లిమిటెడ్​.

Loyal Textile Mills launches world's first reusable PPE with triple viral shield technology
ఇక ఒకే పీపీఈ కిట్​ను మళ్లీమళ్లీ వాడొచ్చు!
author img

By

Published : Jul 11, 2020, 1:23 PM IST

ప్రపంచాన్ని కాలు కదపనీయకుండా చేసిన ఈ కరోనా కాలంలో.. వైరస్​ను మన ఒంటిపై వాలనీయకుండా రక్షణ కల్పిస్తూ కాస్త ధైర్యం నింపుతున్నాయి వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ). అయితే, ఇన్నాళ్లు పీపీఈ కిట్లు అంటే ఒక్కసారి వాడి పడేసే పరికరాలు మాత్రమే. కానీ, ఇకపై ఒక్క పీపీఈ కిట్​ వైరస్​ నుంచి మళ్లీ మళ్లీ రక్షణ కల్పించనుంది. అవును, బెంగళూరులోని లాయల్​ టెక్స్​టైల్ మిల్స్​​ లిమిటెడ్​ .. భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్​, స్విట్జర్లాండ్​కు చెందిన హెచ్​ఐక్యూ సంస్థలతో కలిసి పునర్వినియోగానికి అవకాశమున్న సూపర్ షీల్డ్​ పీపీఈ కిట్లను మార్కెట్​లోకి విడుదల చేసింది.

Loyal Textile Mills launches world's first reusable PPE with triple viral shield technology
ఇక ఒకే పీపీఈ కిట్​ను మళ్లీమళ్లీ వాడొచ్చు!

ఈ సూపర్​ షీల్డ్​ పీపీఈ కిట్లను వాడిన తర్వాత.. ఉతికి ఆరేసి మళ్లీ వాడొచ్చు. ఈ కిట్లు సురక్షితమా కాదా అనే సందేహం​ అక్కర్లేదంటున్నారు ఉత్పత్తిదారులు. ఎందుకంటే.. ఆర్​/ఎలాన్​ ఫీల్​ ఫైబర్​తో తయారు చేసిన ఈ కిట్లు, సూక్ష్మ జీవులు, వైరస్​లను తట్టుకోగలవని అధికారిక పరీక్షల్లో తేలింది. ఇక అధునాతన సాంకేతికతతో ఆవిష్కరించిన ఈ కిట్లు కరోనా వైరస్​ సార్స్​-కోవ్​-2(కొవిడ్​-19)ను 99.99 శాతం అంతం చేస్తున్నట్లు రుజువైంది.

కరోనా బారినపడకుండా కాపాడే పీపీఈ కిట్లే కాదు, మాస్క్​లు, ఫ్యాషన్​ దుస్తులను మళ్లీ మళ్లీ వాడుకునేలా రూపొందించింది లాయల్​ టెక్స్​టైల్​ లిమిటెడ్​. రెండంచెల రక్షణతో తయారయ్యే ఈ కిట్లకు.. తైవాన్​ వైరల్​ బారియర్​ పీయూ ఫిల్మ్​ సంస్థ చేసే లామినేషన్​ మరో రక్షణ కవచంగా పని చేస్తుందంటున్నారు లాయల్​ టెక్స్​టైల్​ మిల్స్​ ప్రెసిడెంట్​ వల్లి ఎం రామస్​.

ఇదీ చదవండి: ధారావిలో కరోనా నియంత్రణ భేష్: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.