హరియాణాలోని రోహ్తక్లో బుధవారం మధ్యాహ్నం 12:58గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 2.8 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం(ఎన్సీఎస్) వెల్లడించింది. 5 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
ఏప్రిల్ 12నుంచి ఇప్పటివరకు ఎన్సీఆర్ దిల్లీ ప్రాంతంలో 18 సార్లు భూకంపాలు సంభవించాయి. అందులో రోహ్తక్లోనే 8 సార్లు భూమి కంపించింది.