ETV Bharat / bharat

మిడతల నుంచి 5.66 లక్షల హెక్టార్ల పంట భూమి సురక్షితం

మిడతల నియంత్రణకు ప్రభుత్వాధికారులు తీసుకున్న చర్యల వల్ల దేశంలోని 10 రాష్ట్రాల్లో 5.66 లక్షల హెక్టార్ల పంట భూమికి నష్టం జరగకుండా కాపాడినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కీటకాలు వాలకుండా స్ప్రేలను చల్లినట్లు తెలిపింది.

Locust control measures over 5.66 lakh hectares in 10 states so far: Centre
మిడతల నుంచి 5.66 లక్షల హెక్టార్ల పంట భూమి సురక్షితంమిడతల నుంచి 5.66 లక్షల హెక్టార్ల పంట భూమి సురక్షితం
author img

By

Published : Aug 24, 2020, 9:49 AM IST

ఈ ఏడాది కరోనా మహమ్మారితో పాటు మిడతల రూపంలో మరో ప్రమాదం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. వీటి వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మిడతలను తరిమికొట్టేందుకు అధికారులు ఎంతో శ్రమించారు. వీరు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల మొత్తం 10 రాష్ట్రాల్లో 5.66 లక్షల హెక్టార్ల పంట భూమికి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్​ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో మిడతల నియంత్రణ అధికారులను​ ఏర్పాటు చేసి కట్టడి చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాగ్రత్తల వల్ల ఆగస్టు 22 వరకు 2,78,716 హెక్టార్ల పంట భూమిని మిడతలు నాశనం చేయకుండా కాపాడినట్లు పేర్కొంది.

వీటితో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్​, ఉత్తరాఖండ్​, బిహార్​ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కట్టడి చర్యల్లో భాగంగా మరో 2,87,374 హెక్టర్ల భూమి కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.

ఆగస్టు 23 న రాజస్థాన్​లోని జైసల్మేర్, జోధ్​పుర్​, బికానెర్​ జిల్లాలు, గుజరాత్​లోని కచ్​​ జిల్లాలో స్పే యంత్రాలతో నియంత్రణ చర్యలు చేపట్టింది కేంద్రం.

"గుజరాత్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్​,హరియాణా రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో పంట నష్టం సంభవించలేదు. కానీ, రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో పంట నష్టం వాటిల్లింది." అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న కారణంగా మిడతల సమూహం పెరిగే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. ఇప్పటికీ ఆఫ్రికాలో ఈ కీటకాల బెడద కొనసాగుతోందని తెలిపారు. ఇండో- పాక్​ సరిహద్దులో వీటి సమూహం విజృంభించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.