ETV Bharat / bharat

ఇక ఒక్క క్లిక్​తో ఆన్​లైన్​లో మద్యం

author img

By

Published : May 6, 2020, 6:29 AM IST

Updated : May 6, 2020, 6:42 AM IST

లాక్​డౌన్ 3.0 లో భాగంగా లిక్కర్ అమ్మకాలకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఛత్తీస్​గఢ్, రాజస్థాన్ పాలకులు భౌతిక దూరం విషయంలో మరింత పటిష్టంగా వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్​గఢ్​లో ఆన్​లైన్ విధానం అమల్లోకి తీసుకురాగా.. రాజస్థాన్​లో కూపన్లు జారీ చేసి విక్రయాలు చేస్తున్నారు.

liquor
ఇక ఒక్క క్లిక్​తో ఆన్​లైన్​లో సరుకు!

రెండు దశల లాక్​డౌన్​లో పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడో దశలో మాత్రం దేశాన్ని జోన్ల వారీగా విభజించి పలు షాపులు తెరిచేందుకు అనుమతించింది. ఇందులో మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే షాపుల వద్ద ఎక్కువ మంది గుమిగూడుతున్న నేపథ్యంలో ఆన్​లైన్​లో లిక్కర్​ను అందుబాటులో ఉంచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ దిశగా ఛత్తీస్​గఢ్​ సర్కారు ఒకడుగు ముందుంది. ఆన్​లైన్ వెబ్​ పోర్టల్​ను ప్రారంభించింది. గ్రీన్​ జోన్లలో ఉన్నవారు ఒక్క క్లిక్​ చేస్తే చాలు.. మందు ఇంటికే వచ్చే ఏర్పాటు చేసింది.

వెబ్​సైట్ ద్వారా..

మార్చి 23 అనంతరం సోమవారమే మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లకు వరుస కట్టారు మందుబాబులు. ఇలా జనం గుమిగూడితే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా ఆన్​లైన్​లో అమ్మకాలకు తెరతీసింది ఛత్తీస్​గఢ్ సర్కారు. csmcl.in అనే వెబ్​సైట్ లేదా మొబైల్ యాప్​ ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.

రాయ్​పుర్, కోర్బా మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఈ సేవలను అందించనుంది ఛత్తీస్​గఢ్​ సర్కారు. ఈ ప్రత్యేక సేవల కోసం మొబైల్, ఆధార్ నెంబర్, అడ్రెస్​లను ఇవ్వాల్సి ఉంటుంది. వన్ టైం పాస్​వర్డ్​ ద్వారా ఆన్​లైన్​ బుకింగ్​లు తీసుకుంటారు. ఒక్కసారి 5 లీటర్ల మద్యాన్ని ఆర్డర్ చేయవచ్చు. డెలీవరీ ఛార్జీగా రూ. 120 వసూలు చేస్తారు.

liquor
ఒక్క క్లిక్​తో మీ ముందుకు..

రాజస్థాన్​లో కూపన్లు..

రాజస్థాన్​లో మద్యం కొనుగోళ్లకు ప్రత్యేక కూపన్లు జారీ చేస్తోంది ప్రభుత్వం. పెద్ద క్యూలైన్లలో నిల్చుని.. భౌతిక దూరం నిబంధనలను మరచిపోతున్న నేపథ్యంలో ఈ కూపన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆయా కూపన్లలో కేటాయించిన సమయంలోనే షాపుకెళ్లి మద్యం కొనుగోళ్లు చేయవలసి ఉంటుంది. అయితే రెడ్​ జోన్లు సహా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేసేందుకు అనుమతించింది రాజస్థాన్ సర్కారు. భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామన్న హామీతోనే షాపులు తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. దుకాణాల ముందు బారికెడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

liquor
రాజస్థాన్​లో కూపన్ల జారీకి ముందు పరిస్థితి

ఇదీ చూడండి: భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

Last Updated : May 6, 2020, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.