ETV Bharat / bharat

ఐపీఎల్​ ఫైనల్​కన్నా మోదీ 'లాక్​డౌన్​ స్పీచ్'​కే అధిక రేటింగ్​

author img

By

Published : Mar 27, 2020, 4:55 PM IST

మార్చి 24న ప్రధాని మోదీ చేసిన లాక్​డౌన్​ టీవీ ప్రసంగానికి కనీవినీ ఎరుగుని రీతిలో రేటింగ్ వచ్చింది. ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​కన్నా ఎక్కువగా దాదాపు 19.7 కోట్ల మంది ఆ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు.

Lockdown address on Mar 24 Modi's best in terms of TV ratings
ఐపీఎల్​ ఫైనల్​కన్నా మోదీ 'లాక్​డౌన్​ స్పీచ్'​కే అధిక రేటింగ్​

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలకు మామూలుగానే ప్రజాదరణ ఎక్కువ. కానీ, ఈ నెల 24న ఆయన చేసిన దేశవ్యాప్త లాక్​డౌన్​ ప్రకటన మాత్రం టీవీ రేటింగుల్లోనే చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఐపీఎల్​ క్రికెట్​ మ్యాచ్​లకూ రాని రేటింగ్​ ఆ ప్రసంగానికి వచ్చిందని బ్రాడ్​కాస్టింగ్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్)​ ప్రకటించింది.

కరోనాను మట్టిగరిపించేందుకు సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని నిర్దేశిస్తూ... 21 రోజులు లాక్​డౌన్​ ప్రకటించారు మోదీ. దాదాపు 19.7 కోట్ల మంది టీవీలో ఆయన ప్రసంగాన్ని తిలకించారు. ​

"బార్క్​ ఇచ్చిన సమాచారం ప్రకారం.. టీవీలో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భారత్​ లాక్​డౌన్​ ప్రకటన అత్యధిక వీక్షకులను సొంతం చేసుకుంది. ​201 ఛానళ్లకుపైగా ఈ ప్రసంగాన్ని ప్రసారం చేశాయి. ఐపీఎల్​ మ్యాచ్​కు సైతం దక్కని ఆదరణ మోదీ లాక్​డౌన్​ ప్రకటనకు దక్కింది."

- శశి శేఖర్, ​ప్రసార భారతి సీఈఓ

గత ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) ఫైనల్​ 13.3 కోట్ల వీక్షణలను పొందింది. జనతా కర్ఫ్యూపై మోదీ ప్రసంగం వ్యూయర్​షిప్​ 8.3 కోట్లకు పైచిలుకే. గతేడాది అధికరణం 370 రద్దుపై ప్రధాని ప్రసంగాన్ని 6.5 కోట్ల మంది చూశారు. 2016లో నోట్ల రద్దు ప్రకటనను 5.7 కోట్ల మంది వీక్షించారు. అయితే ఈ రికార్డులను బద్దలుగొట్టింది లాక్​డౌన్​ ప్రసంగం.

ఇదీ చదవండి:కరోనా వైద్యుల పాటకు నెటిజన్లు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.