ETV Bharat / bharat

ఆరేళ్ల టీచర్ ఆన్​లైన్​ పాఠాలు సూపర్

కరోనా వేళ ఇంట్లో ఉన్నా విద్యార్థులకు పాఠాలు వినడం తప్పట్లేదు. 'అబ్బా ఇంట్లో కూడ ప్రశాంతత లేకుండా ఆ ఆన్​లైన్ క్లాసులు ఎందుకు పెడుతున్నారో' అనుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ, కేరళలో ఒకటో తరగతి చదవుతున్న ఓ టీచర్ చెప్పే ఆన్​లైన్ క్లాసులకు మాత్రం ఎనలేని స్పందన వస్తోంది. ఆ బుజ్జి టీచర్ పాఠాలను విద్యార్థులే కాదు, లక్షలాది మంది నెటిజన్లు తెగ ఆసక్తిగా వింటున్నారు.

Little diyas online classes go viral, spreads laughter in  kerala malappuram
ఆరేళ్ల టీచర్ ఆన్ లైన్ పాఠాలు సూపర్!
author img

By

Published : Aug 17, 2020, 2:37 PM IST

కేరళలో ఆరేళ్ల చిన్నారి టీచర్ ఆన్​లైన్ క్లాసులు వింటూ నవ్వులు పూయిస్తున్నారు నెటిజన్లు. ఆమె పాఠాలు బోధిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, వీడియో కోసం తానేదో యాక్టింగ్ చేసిందనుకునేరు. కానే కదు. ఒకటో తరగతి చదివిన ఆ బుజ్జాయి ఎల్​కేజీ విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులు వినిపిస్తూ ఎందరో టీచర్లు, తల్లిదండ్రుల మన్ననలు పొందుతోంది.

ఆరేళ్ల టీచర్ ఆన్​లైన్​ పాఠాలు సూపర్

అమ్మకు సాయంగా..

మళప్పురం జిల్లాకు చెందిన నుస్రత్, తాహీర్ దంపతుల కుమార్తె దియా ఫాతిమా. దియా తల్లి ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు. అదే బడిలో దియా ఒకటో తరగతి చదువుతోంది. లాక్​డౌన్ వేళ ఇంట్లో నుంచే ఆన్​లైన్ క్లాసులు తీసుకుంటున్న తల్లికి ఓ రోజు ఒంట్లో బాలేదు. దీంతో, దియా తల్లికి సాయపడాలని నిర్ణయించుకుంది. అమ్మను విశ్రాంతి తీసుకోమని చెప్పి, అమ్మలా ఓ చీర కట్టుకుని ఎల్​కేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది.

అసలైన టీచర్లే ఆశ్చర్యపోయేలా.. టమోట, చిక్కుడుకాయలతో విద్యార్థులకు లెక్కలు నేర్పింది దియా. ఎంతో అనుభవం ఉన్న టీచర్​లాగా చిటికెలో పిల్లలకు లెక్కలు చెప్పిన ఆ బుల్లి టీచర్ బోధనా శైలి విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులకూ తెగ నచ్చేసింది. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని, పెద్దయ్యాక టీచర్ అవ్వాలన్నదే తన కల అంటూ ఇప్పటి నుంచే తన ప్రతిభకు సానపడుతోందీ దియా టీచర్.

ఇదీ చదవండి: 'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.