ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద తరలింపుగా మిగిలిపోయే 'వందే భారత్' మిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా విజృంభణ వేళ వివిధ దేశాల్లో చిక్కుకున్న 14,800మంది భారతీయులను.. 7రోజుల్లో 64విమానాల ద్వారా స్వదేశానికి రప్పించనుంది ప్రభుత్వం. మిషన్‌లో భాగంగా గురువారం జరగనున్న కార్యకలాపాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
దాదాపు 2,300మందిని తీసుకురావడానికి దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి 10 విమానాలు బయలుదేరనున్నాయి.
-
#VandeBharatMission, Evacuation of stranded Indians abroad begins today; here is the plan for today; in total over 14,800 stranded Indians will be brought back from 12 countries this week#IndiaFightsCoronavirus pic.twitter.com/OzpTWjF8yU
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#VandeBharatMission, Evacuation of stranded Indians abroad begins today; here is the plan for today; in total over 14,800 stranded Indians will be brought back from 12 countries this week#IndiaFightsCoronavirus pic.twitter.com/OzpTWjF8yU
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 7, 2020#VandeBharatMission, Evacuation of stranded Indians abroad begins today; here is the plan for today; in total over 14,800 stranded Indians will be brought back from 12 countries this week#IndiaFightsCoronavirus pic.twitter.com/OzpTWjF8yU
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 7, 2020
ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
అమెరికాలో...
అమెరికాకు 7 కమర్షియల్ ఫ్లైట్లు నడపనుంది భారత ప్రభుత్వం. ఇవి శనివారం నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రయాణికులను 'కంప్యూటరైజ్డ్ డ్రా' ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ నాన్-షెడ్యూల్డ్ ఫైట్లలో పరిమితి సంఖ్యలో సీట్లు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీసా గడువు ముగిసిన వారు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నవారు, జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
- విమాన ఖర్చులు ప్రయాణికులే భరించాలి.
- ప్రయాణికులను గుర్తించి వారి వివరాలను ఎయిర్ ఇండియా అధికారులకు అందజేతే. అనంతరం అధికారులు ప్రయాణికులతో సంప్రదింపులు.
- ముందు బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన వివరాల కోసం అధికారులను విడిగా సంప్రదించాలి.
- బోర్డింగ్‌కు ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేకుంటేనే అనుమతి ఉంటుంది.
- ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- మాస్క్‌లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- స్వదేశం చేరుకున్నాక సొంత ప్రాంతాలకు చేరుకునే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి.
- ప్రయాణికులకు వైద్య పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
- స్వదేశం వచ్చాక తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి.
- ఆ తర్వాత వైద్య పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపాలి. కొద్దిరోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.