ETV Bharat / bharat

కరోనాకు లిక్కర్ వ్యాక్సిన్​ కాదు: శివసేన - శివసేన

కరోనా మహమ్మారికి మద్యం వ్యాక్సిన్​ కాదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించింది శివసేన. లిక్కర్​ కోసం భారీ సంఖ్యలో గుమిగూడటం సరికాదని తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా వెల్లడించింది.

Liquor
కొవిడ్​-19కు వ్యాక్సిన్​ లిక్కర్​ కాదు: శివసేన
author img

By

Published : May 7, 2020, 5:37 PM IST

మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు చేరటాన్ని తప్పుపట్టింది అధికార శివసేన. కొవిడ్​-19కు వ్యాక్సిన్.. లిక్కర్​​ కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించక పోవటాన్ని పేర్కొంటూ..పార్టీ అధికారక పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది శివసేన.

" మద్యం దుకాణాలు తెరవటం పట్ల ప్రజలకు కలిగిన సంతోషం తాత్కాలికమైంది. లిక్కర్​ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఒక్క ముంబయిలోనే రెండు రోజుల్లో రూ. 65 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ.. మంగళవారం నగరంలో 635 కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 30 మంది మరణించారు. మద్యం దుకాణాలు తెరవటం వల్ల కలిగే దుష్ప్రభావాలు 24 గంటల్లోనే తెలిశాయి. రూ.65 కోట్ల ఆదాయం కోసం.. 65 వేల కరోనా కేసులు సృష్టంచలేము. కరోనాకు లిక్కర్​ వ్యాక్సిన్​ కాదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి."

– శివసేన

దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేందుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొంది శివసేన. మద్యం షాపులను మూసివేసి కేవలం నిత్యావసరాలు, మెడికల్​ షాపులకే అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

భారీ క్యూలు..

గత ఆదివారం రాష్ట్రంలోని నాన్​- కంటైన్​మెంట్​ జోన్లలో చిన్న చిన్న దుకాణాలు, మద్యం షాపులు తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే.. సోమవారం, మంగళవారం రెండు రోజులు లిక్కర్​ షాపుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు ప్రజలు. కిలోమీటర్ల పొడవు వరుస కట్టారు. ఈ నేపథ్యంలో​ అత్యవసరం కాని వస్తువుల దుకాణాలు, లిక్కర్​ షాపులు మూసివేయాలని మంగళవారం రాత్రి ఆదేశించారు ముంబయి కమిషనర్.​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.