ETV Bharat / bharat

'ఓటర్​ ఐడీ-ఆధార్​ అనుసంధానాన్ని పరిశీలిస్తున్నాం' - Aadhaar updates in Indian parliament

ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్​ అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Linking of voter ID with Aadhaar under consideration, says govt
ఓటర్​ ఐడీ-ఆధార్​ అనుసంధానాన్ని పరిశీలిస్తున్నాం
author img

By

Published : Mar 13, 2020, 5:55 AM IST

నకిలీ ఓటర్లను తొలగించేందుకు, దోష రహిత ఎలక్టోరల్​ రోల్​ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల గుర్తింపు కార్డును ఆధార్​తో అనుసంధానం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పార్లమెంటులో తెలిపారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​.

ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్​ కార్డు లింక్ చేస్తారా అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు మంత్రి.

'శాసనసభ విభాగం నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి ఓటర్​ ఐడీతో ఆధార్​ అనుసంధానం చేసేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని సవరణ చేసే అంశాన్ని పరిశీలిస్తాం.'

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

'ఒకే దేశం- ఒకే కార్డు' ప్రవేశపెట్టే అంశంపై కూడా ప్రశ్నలు వచ్చాయి. దీనిపై మంత్రి స్పందిస్తూ.. హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదన్నారు.

ఇదీ చదవండి: 'ఎన్‌పీఆర్‌'కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.