ETV Bharat / bharat

ఇక ఆ 101 రక్షణ ఉత్పత్తుల తయారీ భారత్​లోనే! - AtamNirbhar Bharat

ఆయుధ సంపత్తి సహా రక్షణ ఉత్పత్తుల తయారీకి.. దేశీయంగా ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకునేలా 2020-2024 మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. తుపాకులు, రవాణా విమానాలు సహా 101 ఉత్పత్తులను ఇందుకు ఎంపిక చేసినట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

101 defence items on import embargo list
101 రక్షణ ఉత్పత్తులపై నిషేధం
author img

By

Published : Aug 9, 2020, 4:00 PM IST

ఆత్మనిర్భర్​ భారత్​కు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆయుధ సంపత్తి సహా రక్షణ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు కృషి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ప్రకటించారు. 2020-2024 మధ్య కాలంలో ఈ వస్తువులపై ఆంక్షలు ఉండనున్నాయని తెలిపారు.

రూ.52 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్​..

తుపాకులు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, రాడార్లు, రైఫిళ్లు, శతఘ్నులు సహా 101 ఉత్పత్తులను ఇందుకు ఎంపిక చేసినట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు రాజ్​నాథ్​. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తులను దేశీయంగా కొనుగోలు చేసేందుకు 52వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల బడ్జెట్‌ను.. దేశీయ కొనుగోళ్లు, విదేశీ కొనుగోళ్లుగా విభజిస్తున్నట్లు వివరించారు. దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఓ కాలపరిమితిని నిర్ణయించనున్నట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులతో చర్చించి క్రమంగా మరికొన్ని వాటిని కూడా ఎంపిక చేస్తామని వివరించారు. ​

ఏడేళ్లలో రూ.7 లక్షల కోట్లు...

2015-2020 మధ్య కాలంలో దాదాపు 230 పరికరాల కోసం దాదాపు రూ. 3.35 లక్ష కోట్లు విలువైన ఒప్పందాలు జరిగాయన్నారు రాజ్​నాథ్​. అయితే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో రానున్న ఏడు సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను దేశీయ పరిశ్రమతోనే కుదుర్చుకుంటామని చెప్పారు. వీటిలో లక్షా 30వేల కోట్ల చొప్పున సైన్యం, వైమానిక దళాలకు సంబంధించినవి ఉండగా.. మరో లక్షా 40 వేల కోట్లు విలువైన వస్తువులు నౌకాదళానికి చెందినవి ఉండనున్నాయని వెల్లడించారు.

నిషేధం విధించిన 101 వస్తువుల్లో కొన్ని..

  • ఎంకే ఐఏ- తేలికపాటి యుద్ధ విమానాలు
  • సుదీర్ఘ లక్ష్యాలను చేధించగల క్రూయిజ్​ క్షిపణులు
  • 155ఎంఎం ఆర్టిలరీ రైఫిళ్లు
  • స్నైపర్​ రైఫిళ్లు
  • పినాకా రకం మల్టీ బ్యారెల్​ రాకెట్​ లాంఛర్లు (ఎంబీఆర్ఎల్​​)
  • ట్యాంకు సిములేటర్లు
  • ఎయిర్​ డిఫెన్స్​ ఫైర్​ కంట్రోల్​ రాడార్​
  • బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్స్​
  • బాలిస్టిక్​ హెల్మెట్స్​
  • క్షిపణుల నిర్వీర్య వ్యవస్థ
  • తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు
  • జీసాట్​-6 శాటిలైట్​ టెర్మినల్స్​
  • మిలిటరీ ట్రక్కులు
  • తేలికపాటి మిషన్​ గన్స్​

కాంగ్రెస్​ విమర్శలు..

రాజ్‌నాథ్‌ ప్రకటనను కాంగ్రెస్‌ నేత చిదంబరం ఎద్దేవా చేశారు. రక్షణ మంత్రి ఘనంగా ప్రారంభించి.. కూనిరాగాలతో ముగించారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజ్‌నాథ్‌ ప్రకటన ఆయన కార్యాలయం నుంచి రక్షణ కార్యదర్శులకు ఆదేశాలు అందించడానికి తప్ప దేనికీ పనికిరాదని విమర్శించారు. రక్షణ ఉత్పత్తులను ప్రస్తుతానికి తయారు చేసుకునే ప్రయత్నం చేసి... రెండు నుంచి నాలుగేళ్ల తర్వాత దిగుమతులను నిలిపివేయాలి అన్నట్లుగా ఉందని మండిపడ్డారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ రంగస్థలంలో సరికొత్త 'రాజకీయం'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.