గాంధీ కళ్లజోడు... స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి చిహ్నం. అలాంటి చిహ్నాన్ని తనదైన శైలిలో రూపొందించారు ఒడిశా కళాకారుడు ఒకరు.
స్వచ్ఛ భారత్‌పై అవగాహన పెంచే లక్ష్యంతో 6 అడుగుల భారీ కళ్ల జోడును తయారు చేశారు బ్రహ్మపుర్కి చెందిన హరి గోవింద మహారాణా. ఈ కళ్లద్దాల బరువు 40 కిలోలు. ఒక అద్దంపై వందేమాతరం.... మరో అద్దంపై స్వచ్ఛ భారత్ అని రాశారు. రెండింటినీ జోడించే భాగంపై త్రివర్ణ పతాకం వేశారు.
పూర్తిగా వ్యర్థాలతో చేసిన ఈ గాంధీ కళ్లజోడును రూపొందించేందుకు హరి గోవింద్ 5 రోజులు కష్టపడ్డారు.
ఇదీ చూడండి: దొంగలను తరిమికొట్టిన వృద్ధులకు సాహస పురస్కారం