ETV Bharat / bharat

లెక్క తేలుస్తారా? - Income tax

నోట్ల రద్దు అనంతరం జరిగిన అనుమానిత డిపాజిట్లపై తుది లెక్కలు ప్రకటించింది ఆదాయ పన్ను శాఖ. భారీ సంఖ్యలో 87 వేల అనుమానిత డిపాజిట్లు బ్యాంకుల్లో జమైనట్లు వెల్లడించింది. వీటికి నోట్ల రద్దుతో గల సంబంధాన్ని రాబట్టే దిశగా విచారణ జరుపుతోంది.

ఆదాయ పన్ను శాఖ
author img

By

Published : Mar 7, 2019, 11:57 PM IST

నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో 87వేల అనుమానిత డిపాజిట్లకు సంబంధించిన కేసులను ఆదాయ పన్ను శాఖ గుర్తించిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. చట్ట ప్రకారం వీటిపై తగిన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆదాయ పన‌్ను శాఖకు అప్పగించినట్లు పేర్కొంది.

దీనికోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్‌ను జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మాసం మార్చిలోగా గానీ, జూన్‌ మాసం చివరికల్లా గానీ విచారణ పూర్తి చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖను కోరింది.

కేసుల విశ్లేషణకు ముందు 3లక్షల మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందన్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వాటిలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 87 వేల మంది ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయలేదని పేర్కొంది.

నోట్ల రద్దు సమయంలో అనూమానిత లావాదేవీలకు పాల్పడ్డ 87 వేల మంది వివరాలు ఆదాయ పన్ను శాఖకు అందిస్తామన్న ప్రత్యక్ష పన్నుల బోర్డు.. ఆయా లావాదేవీలకు నోట్లు రద్దుతో గల సంబంధాన్ని విశ్లేషించాల్సిందిగా ఐటీ శాఖను కోరింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.