ETV Bharat / bharat

కవి దిగ్గజం అచ్యుతన్​ నంబూదిరి కన్నుమూత - ప్రముఖ మలయాళ కవిదిగ్గజం అచుతన్​ నంబూదిరి ఇకలేరు.

ప్రముఖ మలయాళ కవి అక్కితం అచ్యుతన్​ నంబూదిరి త్రిశూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 94ఏళ్ల ఆయన మలయాళ సాహితీ లోకానికి ఎనలేని సేవలందించారు.

legendary-poet-akkitham-achuthan-namboothiri-passes-away-at-94
ప్రముఖ మలయాళ కవిదిగ్గజం అచుతన్​ నంబూదిరి ఇకలేరు.
author img

By

Published : Oct 15, 2020, 3:51 PM IST

మలయాళ దిగ్గజ కవి అక్కితం అచ్యుతన్ నంబూదిరి గురువారం ఉదయం త్రిశూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. మలయాళంలోని మొట్టమొదటి ఆధునిక కవిత్వంతో నవ ఒరవడి సృష్టించిన వ్యక్తిగా కీర్తి గడించారాయన. పాలక్కడ్​లో జన్మించిన నంబూదిరి కవిత్వంతో పాటు అనేక గొప్ప వ్యాసాలు కూడా రాశారు.

సాహితీ లోకానికి నంబూదిరి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2017 లో పద్మశ్రీతో సత్కరించింది. సాహితీ ప్రపంచంలో గొప్పదైన జ్ఞానపీఠ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. గత నెలలోనే ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఎళుతాచ్చన్ పురస్కారం సహా కేరళ సాహిత్య అకాడమీ అవార్డులూ గెలుచుకున్నారు అక్కితం.

​'ఇరుపతం నూట్టండింటే ఇతిహాసం' (20 వ శతాబ్దపు పురాణం) అనే రచన నంబూదిరి రాసిన వాటిలో ముఖ్యమైంది. ఆయన మరణంపై కేంద్ర మాజీ మంత్రి సుభాష్​ భమ్రే, ఎంపీ శశిథరూర్​ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: ప్రముఖ మలయాళ రచయిత​కు జ్ఞాన్​పీఠ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.