ETV Bharat / bharat

'బంగాల్​లో వామపక్షాలే టీఎంసీకి ప్రత్యామ్నాయం' - TMC

2021లో జరగనున్న బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీకి కాంగ్రెస్​-వామపక్షాలే ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా వ్యాఖ్యానించారు. బంగాల్​ ప్రజలకు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్​తో కలిసి ప్రచారం చేస్తామని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

Left and Congress could be an alternative in West Bengal: D Raja
బంగాల్​ బరిలో కాంగ్రెస్​- వామపక్షాల కూటమి!
author img

By

Published : Dec 18, 2020, 3:58 PM IST

వచ్చే ఏడాది జరగనున్న బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు సాధారణ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)కు చెక్​ పెట్టాలని భాజపా వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు వరుస పరాజయాలతో కసిగా ఉన్న కాంగ్రెస్​ బంగాల్​లో పట్టునిలుపుకోవాలని ఆశ పడుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలు- కాంగ్రెస్ కూటమే.. టీఎంసీకి ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించారు.

'కాంగ్రెస్​తో జత కడతాం'

కలిసి ప్రచారం చేస్తాం..

బంగాల్​ ప్రజలకు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తాం. కాంగ్రెస్​తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ ఇంఛార్జీగా నియమితులైన జితిన్​ ప్రసాద్​ త్వరలోనే వామపక్ష నేతలతో మాట్లాడుతారు.

కాంగ్రెస్​ ఆత్మపరిశీలన చేసుకోవాలి..

ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన క్షేత్ర, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్​లో..​ అంతర్గత సంక్షోభం తలెత్తి, అసంతృప్తితో పలువురు నేతలు పార్టీ వీడారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం​ ఆత్మవిమర్శ చేసుకోవాలి.

బంగాల్​ ఎన్నికల్లో భాజపా వ్యూహం ఏంటని అనుకుంటున్నారు..

రాష్ట్ర రాజకీయాల్లో భాజపా, టీఎంసీలే ప్రధాన పార్టీలని సృష్టించడానికి కాషాయ దళం ప్రయత్నిస్తోంది. అది ఎప్పటికీ జరగదు. అయితే గవర్నర్​, కేంద్ర సంస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను భాజపా ఉపయోగించుకుంటోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్లు సృష్టించాలని ప్రయత్నిస్తోంది.

బంగాల్​ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం

మమతా బెనర్జీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బంగాల్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఉపయోగించుకుని సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని భాజపా ఎత్తులు వేస్తుంది. అయితే అది జరగదు. మేమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

భాజపా దూకుడుకు చెక్​..

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల ఫలితాలతో.. దక్షిణాదిన దూకుడు పెంచింది భాజపా. కేరళలో అదే దూకుడు ప్రదర్శించాలని భావించిన కాషాయ దళం పూర్తిగా విఫలమైంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బంగాల్​, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరుగుతుంది.

ఎక్కువ కాలం కొనసాగవు

భాజపా కేంద్రీకృత రాజకీయలు ఎక్కువ కాలం కొనసాగవు. ఆ పార్టీకి తగిన సమాధానం ప్రజలే చెప్తారు. టీఎంసీ పార్టీలో అంతర్గత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆసరాగా తీసుకుని భాజపా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది.

ఇదీ చూడండి: సువేందు దారిలో మరొకరు- దీదీకి గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.