ETV Bharat / bharat

100వ పడిలోకి గణాంక యోధుడు సీఆర్​రావు

ప్రముఖ గణాంక శాస్త్రవేత్త, ప్రొఫెసర్​ కల్యంపూడి రాధాకృష్ణరావు గురువారం వందో పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా భారత్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ బుధవారం సాయంత్రం వెబినార్​ ద్వారా సింపోజియం నిర్వహించింది. దేశవిదేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.

Professor Kalvampudi Radhakrishna Rao
గణాంక యోధుడు సీఆర్​రావు 100వ పుట్టినరోజు
author img

By

Published : Sep 10, 2020, 7:39 AM IST

ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త, పద్మవిభూషణ్​ ప్రొఫెసర్​ కల్యంపూడి రాధాకృష్ణరావు (సీఆర్​ రావు) గురువారం వందో పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఇండియన్​ స్టాటిస్టికల్​ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్​​ బఫలోలో రీసెర్చ్​ ప్రొఫెసర్​గా సేవలందిస్తున్నారు.

భారత్​ స్టాటిస్టిక్​ రంగానికి ఆయన చేసి సేవలను గుర్తుచేసుకుంటూ భారత్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ బుధవారం సాయంత్రం వెబినార్​ ద్వారా నిర్వహించిన సింపోజియంలో దేశవిదేశాలకు చెందిన పలువురు శాస్త్రవేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. సీఆర్​ రావు సేవలు కేవలం స్టాటిస్టికల్​ రంగానికే కాకుండా ఎకనమిక్స్​, జెనిటిక్స్​, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు బుధవారం నాటి వెబినార్​లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

విద్యార్థిగా చేరి డైరెక్టర్​గా..

హైదరాబాద్​లోని సీఆర్​రావు అడ్వాన్స్​డ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మ్యాథమెటిక్స్​, స్టాటిస్టిక్స్​ అండ్​ కంప్యూటర్స్​ సైన్స్​ వ్యవస్థాపకులైన సీఆర్​ రావు 1920 సెప్టెంబర్​ 10న బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్​లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్​ చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్​ కోల్​కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్​ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్​ కాలేజీలో 1948లో పీహెచ్​డీ పూర్తిచేశారు. ఇండియన్​ స్టాటిస్టికల్​ ఇన్​స్టిట్యూట్​ విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్​గా ఎదిగారు.

39 డాక్టరేట్లు..

19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న ఆయన ఇప్పటి వరకు 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జ్​బుష్​ చేతులమీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్​ మెడల్​ ఆఫ్​ సైన్స్​ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్​ స్టాటిస్టికల్​ ఇన్​స్టిట్యూట్​, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మ్యాథమెటికల్​ సైన్స్​, ఇంటర్నేషనల్​ బయోమెట్రిక్​ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు. భారత స్టాటిస్టిక్స్​ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్​ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్​, 2001లో పద్మవిభూషణ్​తో సత్కరించింది.

ఇదీ చూడండి: 'పీవీతో పాటు ఆయనకూ భారతరత్న ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.