ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణం జరిగింది. 25 ఏళ్ల న్యాయవిద్యార్థిని ఆయుధాలతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంకే ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
స్నేహితుడిని కొట్టి..
మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సంగ్రామ్పుర్ శివారుల్లో ఆ యువతి స్నేహితుడితో కలిసి ఉండగా ఈ దారుణం జరిగింది. ఆయుధాలతో వచ్చిన కొంతమంది ఆమె స్నేహితుడిని కొట్టి.. బాధితురాలిని కొంతదూరం తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
పోలీసులు నిందితుల నుంచి కారు, బైక్, ఒక తుపాకీ, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి నుంచి దొంగలించిన మొబైల్‌ను సీజ్ చేశారు.