ETV Bharat / bharat

ట్రంప్ పర్యటన సమాప్తం- అమెరికాకు బయల్దేరిన అధ్యక్షుడు

author img

By

Published : Feb 25, 2020, 9:29 AM IST

Updated : Mar 2, 2020, 12:11 PM IST

LATEST UPDATES ON TRUMP'S DELHI VISIT
లైవ్​: దిల్లీలో బిజీ బిజీగా ట్రంప్ ​

22:28 February 25

పర్యటన సమాప్తం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు అమెరికా పయనమయ్యారు. అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్​ఫోర్స్​ వన్​లో స్వదేశానికి తిరిగి బయల్దేరారు.

22:06 February 25

వీడ్కోలు!

అగ్రరాజ్య దంపతులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఇచ్చిన విందు కార్యక్రమం ముగిసింది. విందు అనంతరం డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి భవన్​ను విడిచివెళ్లారు. కోవింద్​తో పాటు ప్రధాని మోదీ అధ్యక్షుడికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అధ్యక్షుడికి మోదీ ఆత్మీయ ఆలింగనం ఇచ్చారు.

20:50 February 25

రాష్ట్రపతి విందుకు హాజరైన రాజకీయ ప్రముఖులు

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అమెరికా అధ్యక్షుడికి ఇస్తున్న గౌరవ విందుకు కేంద్ర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ విందులో రకరకాల రుచులను ఏర్పాటు చేశారు. శాఖాహారం, మాంసాహార వెరైటీలు ఉన్నాయి. శాఖాహారంలో భాగంగా దాల్​ రైసీనా, మింట్ రైతా వంటి ఆహార పదార్థాలు, మాంసాహారంలో ఖాజూ సాల్మన్, ధమ్ ఘోష్ బిర్యానీ ఉంచారు.

20:10 February 25

రాష్ట్రపతి భవన్​లో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జారెద్ కుష్నర్ రాష్ట్రపతి భవన్​కు చేరుకున్నారు. ట్రంప్ కుటుంబసభ్యులకు ఆహ్వానం పలికారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, సవితా కోవింద్ దంపతులు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

17:57 February 25

చాలా సంక్లిష్టమైన అంశాలున్నాయి..

  • పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి: ట్రంప్‌
  • పాక్‌ నుంచి ఉన్న ఉగ్ర ముప్పుపై మోదీ తగిన జాగ్రత్తలు తీసుకోగలరు: ట్రంప్‌
  • మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ దృఢంగా ఉంటారు: ట్రంప్‌
  • భారత్‌, పాక్ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి: ట్రంప్‌
  • ఇరుదేశాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని గతంలోనే చెప్పా: ట్రంప్‌
  • కశ్మీర్‌ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలున్నాయి: ట్రంప్‌
  • ప్రతి కథకు 2 పార్శ్వాలు ఉంటాయి: ట్రంప్‌

17:44 February 25

  • అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌లో మా బలగాలను తగ్గిస్తున్నాం: ట్రంప్‌
  • వేలమంది అమాయకులను ఐసిస్ బలిగొంది: ట్రంప్‌
  • అలాంటి ఐసిస్‌ను తుదముట్టించే లక్ష్యంతో పనిచేస్తున్నాం: ట్రంప్‌
  • భారత్‌లో మతస్వేచ్ఛ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది: ట్రంప్‌
  • ఇవాళ మాటామంతీలోనూ మోదీ దాని గురించి వివరించారు: ట్రంప్‌

17:40 February 25

  • అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలని మా ప్రయత్నం: ట్రంప్‌
  • అఫ్గాన్‌లో 19 ఏళ్లుగా శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నాం: ట్రంప్‌
  • ఉగ్రవాదంపై పోరాడుతున్నామే తప్ప అమాయకులను లక్ష్యం చేసుకోవడం లేదు: ట్రంప్‌
  • అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలని భారత్‌ కూడా కోరుకుంటోంది: ట్రంప్‌
  • ఉగ్రవాదంపై పోరాటంలో నేను చేసినంత కృషి మరెవరూ చేయలేదు: ట్రంప్‌

17:29 February 25

ట్రంప్‌ మీడియా సమావేశం

  • రెండు రోజుల భారత్‌ పర్యటన అద్భుతంగా సాగింది: ట్రంప్‌
  • ప్రధాని మోదీతో బలమైన మైత్రి ఏర్పడింది: ట్రంప్‌
  • భారత సీఈవోలతో సమావేశం సంతృప్తినిచ్చింది: ట్రంప్‌
  • ప్రధాని మోదీ గొప్ప నేత: ట్రంప్‌

16:13 February 25

మోదీపై ప్రశంసలు

  • మీ ప్రధాని ఎంత మంచివారో.. అంతే ఘటికుడు: ట్రంప్‌

16:10 February 25

చైనాతో వాణిజ్య యుద్ధంపై ట్రంప్ స్పందన

  • మొదట చైనాయే వాణిజ్య యుద్ధం మొదలుపెట్టింది: ట్రంప్‌
  • మొదట చైనావాళ్లే అదనపు సుంకాలు విధించారు: ట్రంప్‌
  • దానికి ప్రతిగానే అమెరికా కూడా సుంకాలు విధించింది: ట్రంప్‌
  • మేం విధించిన అదనపు సుంకాలను రైతులకే బదిలీ చేశాం: ట్రంప్‌

16:07 February 25

ఉద్యోగాల కల్పనపై ట్రంప్..

  • ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వగలదు కానీ ప్రైవేట్‌ రంగం ఉద్యోగాలు సృష్టిస్తుంది: ట్రంప్‌
  • పర్యావరణ పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం: ట్రంప్‌

15:56 February 25

భారత కంపెనీల సీఈఓలతో ట్రంప్ సమావేశం

  • భారత్‌లో అద్భుతమైన స్వాగతం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది: ట్రంప్‌
  • రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడం వల్ల సంస్కరణలకు అవకాశం చిక్కింది: ట్రంప్‌
  • ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని తెచ్చాం: ట్రంప్‌
  • కరోనా వైరస్‌పై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడా: ట్రంప్‌
  • కరోనాను ఎదుర్కొనేందుకు చైనా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది: ట్రంప్‌
  • కరోనా విషయంలో చైనాలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది: ట్రంప్‌
  • భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయి: ట్రంప్‌
  • ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులు అధిగమించాల్సి ఉంది: ట్రంప్‌
  • రానున్న ఆరేడు నెలల్లో ఒప్పందం రూపుదాల్చనుంది: ట్రంప్‌
  • రాబోయే ఎన్నికల్లో గెలుస్తానన్న విశ్వాసం ఉంది: ట్రంప్‌
  • మేం విజయం సాధిస్తే మార్కెట్లు భారీగా పుంజుకుంటాయి: ట్రంప్‌
  • సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యం: ట్రంప్‌
  • లేదంటే ఆర్థిక పురోభివృద్ధి కుంటుపడుతుంది.. నిరుద్యోగం పెరుగుతుంది: ట్రంప్‌

15:41 February 25

అమెరికా దౌత్య కార్యాలయంలో భేటీ...

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అమెరికా దౌత్య కార్యాలయానికి వెళ్లారు. అక్కడి అధికారులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ట్రంప్​ భేటీ అయ్యారు.

13:46 February 25

మోదీ-ట్రంప్​ మీడియా సమావేశం

" ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైంది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేనివి. రెండు దేశాలకు ఇది చాలా ఫలవంతమైన పర్యటనగా ఉంటుంది. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించాం. 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌పై చర్చించాం. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా చర్చించాం. పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయం. ఇంధన రంగంలో ఇరుదేశాలు ఒక అవగాహనతో ముందుకెళ్లాలని నిర్ణయించాం. భారత్‌కు భారీ మొత్తంలో ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు చేసేందుకు అవగాహన కుదిరింది. మహిళా పారిశ్రామిక వేత్తలకు అమెరికా ప్రోత్సాహం ఎప్పుడూ  ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు ఇవాంక హాజరయ్యారు. ఇరుదేశాలకు మేలుచేసే మరికొన్ని కీలక ఒప్పందాలపై అవగాహనకు వచ్చాం. సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడతా."

- డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

13:29 February 25

మోదీ మీడియా సమావేశం...

"భారత్‌-అమెరికా మైత్రికి ప్రభుత్వాలతో సంబంధం లేదు.ప్రజల కేంద్రంగానే బంధం బలోపేతమవుతూ వస్తోంది. నమస్తే ట్రంప్‌ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారత సైన్యం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో అమెరికాతో సంయుక్త విన్యాసాలు చేపడుతోంది. రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరబోతున్నాయి. దేశ భద్రతకు అమెరికా, భారత్‌ మైత్రీబంధం ఎంతో సహాయకారిగా ఉంటుంది.

మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ. భారత్‌, అమెరికా వాణిజ్యపరంగా సమాన అవకాశాలకు కట్టుబడి ఉన్నాయి. వాణిజ్యపరమైన వైరుధ్యాలపై ఇరుదేశాల వాణిజ్య మంత్రుల స్థాయిలో సానుకూల చర్చలు. భారీ వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల మంత్రులు చర్చలు సాగిస్తున్నారు. త్వరలోనే చట్టపరమైన అవరోధాలను అధిగమించి వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకెళ్తాం. అధ్యక్షుడు ట్రంప్‌ చొరవ లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. ఇరుదేశాల మధ్య మైత్రీబంధం ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుంది. " 

          - ప్రధాని నరేంద్ర మోదీ

13:25 February 25

మీడియా సమావేశం...

మోదీ- ట్రంప్​ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.

13:19 February 25

ముగిసిన భేటీ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. అగ్రనేతలు ఇరువురు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

12:50 February 25

కాసేపట్లో పత్రికా సమావేశం...

హైదరాబాద్​ హౌస్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. కానేపట్లో పత్రికా సమావేశం ఉండనుంది.

12:26 February 25

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, దిల్లీలోని సర్వోదయ విద్యాలయ పాఠశాలను సందర్శించారు. దిల్లీలోని దక్షిణ మోతీభాగ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్‌ తరగతిని చూసేందుకు విచ్చేసిన మెలానియా ట్రంప్‌నకు పాఠశాల విద్యార్థులు... ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు పుష్పగుచ్ఛాన్ని అందించి.... తిలకం దిద్ది హరతి ఇచ్చారు. మెలానియా కోసం సర్వోదయ విద్యాలయ పాఠశాలను పుష్పాలతో అలంకరించి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. పలువురు చిన్నారులు చీరలు, గాగ్రాఛోలీ ధరించి... సంగీత వాద్యాలతో సందడి చేశారు.

దిల్లీ ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. ఇందులో ధ్యానం, వీధి ఆటలు, పిల్లల్లో విధేయత పెంచడం సహా పిల్లల్లో ఒత్తిడి, ఆందోళనను తగ్గించే కార్యక్రమాలు చేపడతారు.

12:08 February 25

దిల్లీ నానక్​పుర​లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో తరగతి గదిలో ముచ్చటించారు మెలానియా ట్రంప్​.

11:52 February 25

అమెరికా అధ్యక్షుడి భార్య, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్​ దిల్లీలోని సర్వోదయా ఉన్నత పాఠశాలను సందర్శించారు. కేజ్రీవాల్​ సర్కార్​ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 'క్లాస్​ ఆఫ్​ హ్యాపీనెస్​​' గురించి స్వయంగా తెలుసుకోనున్నారు. 

11:49 February 25

రాజ్‌ఘాట్‌ వద్ద ట్రంప్‌ ఏం సందేశం రాశారంటే

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ట్రంప్‌ అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆయన ఏం రాశారంటే.. ‘మహాత్ముడి ఆలోచనల నుంచి ఉద్భవించిన అద్భుతమైన భారత్‌కు అమెరికా ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఇది నాకు దక్కిన అద్భుతమైన గౌరవం’ అని రాసుకొచ్చారు. 

11:25 February 25

భారత్​లో రెండు రోజుల పర్యటన ముగియనున్న సందర్భంగా.. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఐటీసీ మౌర్య హోటల్‌లో జరిగే ఈ సమావేశంలో భారత్​లో తన పర్యటనపై స్పందించనున్నారు ట్రంప్.

11:13 February 25

భేటీ షురూ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో హైదారాబాద్​ హౌస్​లో ద్వైపాక్షిక భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా చర్చల అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు ఇరువురు నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

11:01 February 25

మొక్కనాటిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌ మహాత్ముని సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆ ప్రాంగణంలో మొక్కను నాటారు.   

10:57 February 25

ట్రంప్‌కు మహాత్ముడి ప్రతిమ  

రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ట్రంప్‌ అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పొందు పరిచారు. ఈ సందర్భంగా భారత ప్రతినిధి ఆయనకు గాంధీజీ ప్రతిమను అందించారు.

10:40 February 25

మహాత్ముడి స్మరణలో ట్రంప్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. సతీమణి మెలానియాతో కలిసి మహాత్ముడిని స్మరించుకున్నారు ట్రంప్​. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు హైదరాబాద్​ హౌస్​కు బయలుదేరారు. అక్కడే దాదాపు గంటకుపైగా ప్రధానితో పలు ఒప్పందాలపై చర్చించి ఇరువురు నేతలు సంతకాలు చేసే అవకాశముంది.

10:19 February 25

మహాత్ముడికి ట్రంప్​ నివాళి

రాష్ట్రపతి భవన్​లో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్‌ఘాట్‌కు బయల్దేరారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా. మరికాసేపట్లో రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు‌.

10:05 February 25

ట్రంప్​ దంపతులకు సాదర స్వాగతం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు అగ్రరాజ్య అధ్యక్షుడు.

10:00 February 25

రాష్ట్రపతి భవన్​కు ఇవాంక ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు సాదర స్వాగతం పలికేందుకు రాష్ట్రపతి భవన్​లో ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు. మరికాసేపట్లో పెద్దన్న అక్కడికి చేరుకోనున్న సందర్భంగా.. ఆయన కుమార్తె, అధ్యక్షుడి సీనియర్​ సలహాదారు ఇవాంక ట్రంప్​ రాజ్​భవన్​కు చేరుకున్నారు.

09:07 February 25

ట్రంప్​ షెడ్యూల్​ ఇదే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్​కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పెద్దన్నకు ఘనంగా స్వాగత పలికేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు.

అనంతరం రాజ్​ఘాట్​లోని​ మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం.. అమెరికా ఎంబసీ అధికారులతో సమావేశం కానున్నారు. ఇదే సమయంలో పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరిపే అవకాశముంది. పలు కార్యక్రమాల అనంతరం రాత్రి 10 గంటలకు స్వదేశానికి బయల్దేరనున్నారు. ఇంతటితో తొలిసారి భారత్​లో పర్యటించిన ట్రంప్​ షెడ్యూల్​ ముగియనుంది.

Last Updated : Mar 2, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.