ETV Bharat / bharat

గుజరాత్​లో ఒక్కరోజే 280 కరోనా కేసులు.. 12 మరణాలు

coronavirus
అగ్రరాజ్యంలో ఉగ్రరూపం
author img

By

Published : Apr 18, 2020, 8:47 AM IST

Updated : Apr 18, 2020, 10:12 PM IST

22:04 April 18

గుజరాత్​లో 53కు పెరిగిన మరణాలు

గుజరాత్​లో​ మొత్తం కరోనా మరణాల సంఖ్య 53కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 280 మందికి వైరస్​ సోకగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1376కు చేరింది.  

19:52 April 18

మహారాష్ట్రలో 3,648కి చేరిన కేసులు

దేశవ్యాప్తంగా ఇవాళ ముంబయిలోనే అత్యధికంగా 184 కేసులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 328 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 3,648కి చేరింది.

19:29 April 18

తమిళనాడులో 1372కు చేరిన కేసులు

  • తమిళనాడులో ఇవాళ 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • తమిళనాడులో 1,372కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
  • తమిళనాడులో కరోనాతో ఇప్పటివరకు 15 మంది మృతి

19:01 April 18

బ్రిటన్​లో 15,464
బ్రిటన్​లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 888 మంది మరణించినందున.. దేశవ్యాప్తంగా కొవిడ్​-19 మరణాల సంఖ్య 15,464కు చేరింది.

17:52 April 18

దేశవ్యాప్తంగా 15వేలకు చేరువలో కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 488కి చేరింది. మొత్తం కేసులు 14,792కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 2015 మంది వైరస్​ బారినుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.

17:02 April 18

స్పెయిన్​లో 20వేలు

స్పెయిన్​లో కరోనా మృత్యుఘోష ఆగట్లేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 565 మంది మృతి చెందినందున.. మొత్తం మరణాల సంఖ్య 20వేలు దాటింది. ప్రస్తుతం స్పెయిన్​లో 20,043 మంది మృత్యువాతపడగా, కేసులు 1,91,726కు చేరింది.

ఇరాన్​లోనూ కొవిడ్​-19 మృతులు 5వేలు దాటింది.

16:27 April 18

విమానసేవలు రెడీ!

మే 4 నుంచి కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్​ విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే బుకింగ్స్​ కూడా ప్రారంభించింది. జూన్ 1 నుంచి అంతర్జాతీయ సేవలనూ పునరుద్ధరించనున్నట్లు అధికారిక వెబ్​సైట్లో తెలిపింది. కరోనా నియంత్రణకు కేంద్రం విధించిన లాక్​డౌన్​ మే 3న ముగియనుంది.

16:14 April 18

  • కరోనా బాధితుల్లో మరణాలు 3.3 శాతం మాత్రమే: కేంద్రం
  • కరోనా మృతుల్లో 14.4 శాతం మంది 45 ఏళ్లలోపువారు: కేంద్రం
  • కరోనా మృతుల్లో 10.3 శాతం మంది 45-60 ఏళ్లలోపువారు: కేంద్రం
  • కరోనా మృతుల్లో 33.1 శాతం మంది 60-75 ఏళ్లలోపువారు: కేంద్రం
  • కరోనా మృతుల్లో 42.2 శాతం మంది 75 ఏళ్లు పైబడినవారు: కేంద్రం
  • దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు: లవ్‌ అగర్వాల్‌
  • దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో 2 వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు: లవ్ అగర్వాల్‌
  • గడిచిన 24 గంటల్లో 900 కొత్త కేసులు నమోదు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • కరోనా నుంచి 1992 మంది కోలుకున్నారు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • గడిచిన 24 గంటల్లో 43 మంది మరణించారు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • భౌతికదూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలి: కేంద్రం
  • హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని వారికి రాపిడ్‌ యాంటీ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలి: కేంద్రం
  • లక్షణాలు కనిపించినా, విదేశీ పర్యటన చరిత్ర ఉంటే తప్పక టెస్టులు: కేంద్రం
  • అవసరమైతే ఎన్‌-95 మాస్కులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం: కేంద్రం
  • కరోనా పరీక్షల కోసం ఎక్కువ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం: కేంద్రం
  • రెడ్‌ జోన్‌, క్వారంటైన్‌ ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలి: కేంద్రం
  • ప్రజలు సహకరిస్తేనే కరోనాను సమర్థంగా ఎదుర్కోగలుగుతాం: కేంద్రం

15:42 April 18

బీమా పొడిగింపు

పోస్టల్​ ఉద్యోగులకు కల్పించిన రూ.10 లక్షల బీమాను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ్​ డక్​ సేవక్స్​తో సహా విధులు నిర్వర్తిస్తూ కరోనా కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోయినా ఈ పరిహారం అందిస్తామని తెలిపింది. తాజా మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది కేంద్ర సమాచార శాఖ.

15:12 April 18

కరోనాతో చికిత్స పొందుతూ ఏసీపీ మృతి

కరోనా మహమ్మారి బారినపడి పంజాబ్​ లూథియానా అసిస్టెంట్​ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ (ఏసీపీ) అనిల్​ కోహ్లీ మృతి చెందారు. స్థానిక ఎస్​పీఎస్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోహ్లీ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

15:08 April 18

ఒక్కొక్కరికి రూ.2వేలు

భవన నిర్మాణ కార్మికులకు బాసటగా నిలిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 లక్షల మంది నమోదిత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2వేలు అందిస్తామని వెల్లడించింది.

15:06 April 18

లాక్​డౌన్​ ఉల్లంఘించారని 10729 మంది అరెస్ట్​

మహారాష్ట్రలో లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ.. ఇప్పటివరకు 10,729 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 33,984 వాహనాలను సీజ్​ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీ సెక్షన్​ 188 కింద 52,626 కేసులు రిజిస్టర్​ చేసినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 మంది పోలీసు అధికారులు, 29 మంది ఇతర పోలీసు సిబ్బంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు.

14:59 April 18

మాజీ ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలో 11 మందితో సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్​ పార్టీ. తాజా పరిస్థితుల్లో రోజుకోసారి చర్చించి పార్టీకి సూచనలు చేయనుంది ఈ బృందం. అలాగే పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలనూ ఖరారు చేయనుంది.

14:41 April 18

కరోనా చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై సర్వే చేయాలని, వాటి వినియోగాన్ని పర్యవేక్షించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

13:32 April 18

  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రులు బృందం -జీఓఎం
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ సమీక్ష కోసం రాజ్‌నాథ్‌ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని నియమించిన ప్రధాని.
  • లాక్​డౌన్‌ పొడిగింపు, ఏప్రిల్‌ 20 నుంచి దేశంలోని నాన్ హాట్‌స్పాట్‌ జోన్లలో పాక్షికంగా అనుతించే ఆర్ధిక కార్యకాలపాలపై సమీక్షించిన కేంద్ర మంత్రుల బృందం.
  • లాక్‌డౌన్‌ పొడిగింపు తర్వాత.. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలు, కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకాలపాలు అనుమతించే విషయాలపై పలు మంత్రిత్వ శాఖల నుంచి సమాచారం తీసుకున్న మంత్రుల బృందం...
  • వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభిచాల్సి ఉంటుందని మంత్రుల బృందం అభిప్రాయపడినట్లు సమాచారం.
  • పదవీ విరమణ పొందిన వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య విద్య గ్యాడ్యుయేషన్‌ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్ధుల సేవలు ఉపయోగించుకునే విషయంలో వచ్చిన పలు సూచనలపై మంత్రుల బృందం చర్చించినట్లు సమాచారం.
  • సామాజిక దూరం పాటించే విషయంలో ఇచ్చిన నిబంధనలు పాటించాలని, సామూహిక ప్రార్ధనలలో లేదా మత పరమైన కార్యక్రమాలకు హాజరు కావడం మానుకోవాలని ప్రజలకు సూచించిన మంత్రుల బృందం.
  • ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి చేయూత ఇవ్వడం, ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోవడం, సామాజిక దూరం పాటించే విషయంలో ప్రధాని చేసిన సూచనలు అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రులు బృందం.

13:28 April 18

  • వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలనే అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
  • ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్
  • వలసకూలీలకు కరోనా పరీక్షలు చేసి స్వస్థలాలకు పంపించాలని కోరిన పిటిషనర్
  • పలుచోట్ల వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న పిటిషనర్‌

13:07 April 18

ముంబయిలో ఓ కూరగాయల వ్యాపారి-పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగింది. కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించిన మాన్​ఖుర్ద్​లో కూరగాయలు అమ్మకునేందుకు ఓ మహిళా వ్యాపారి రాగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. అయితే ఆమె ఎంత చెప్పినా వినకపోయే సరికి.. కూరగాయల తోపుడు బండిని కిందకు నెట్టేశాడు ఓ కానిస్టేబుల్.

అధికారుల చర్యతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ పోలీసులపై దాడికి యత్నించింది.  

12:55 April 18

రాహుల్​పై శివసేన పొగడ్తలు

కరోనా సంక్షోభంలో ప్రతిపక్ష పార్టీ ఎలా వ్యవహరించాలో రాహుల్​ గాంధీ చూపించారని కొనియాడింది శివసేన. ప్రధాని మోదీతో రాజకీయ విబేధాలున్నప్పటికీ.. ప్రజా శ్రేయస్సు కోసం రాహుల్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని తమ అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో రాసుకొచ్చింది.

12:37 April 18

  • #WATCH "2 days ago, some people attacked an ambulance- kuch sharam kariye! Ppl who're attacking doctors, healthcare workers,policemen,media persons,should be punished.Appeal to admin to take strict action against such people.#CoronaWarriors hain toh zindagi hai!"BJP's Hema Malini pic.twitter.com/8gMxBE08g2

    — ANI (@ANI) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా వైరస్​పై దేశం యుద్ధం చేస్తున్న సమయంలో.. అంబులెన్స్​, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా వర్గాలపై జరుగుతున్న దాడులపై స్పందించారు భాజపా నేత హేమామాలిని. ఇలాంటి దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

12:11 April 18

మధ్యప్రదేశ్​లో కేసులు 'అప్​'

మధ్యప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా మరికొంతమంది వైరస్​ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 1355కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69 మంది మరణించారు.

11:13 April 18

72 గంటల్లో ఒక్క కేసూ లేదు!

కరోనా వైరస్​ వ్యాప్తి నుంచి ఒడిశాకు కాస్త ఉపశమనం కలిగింది. గడిచిన 72 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గత మూడు రోజుల్లో 1042 శాంపిల్స్​ను పరీక్షించగా వీరందరికీ కరోనా నెగటివ్​గా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

భువనేశ్వర్​లో మరో ఇద్దరు వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో వైరస్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య 21కి పెరిగింది. ఒడిశాలో ప్రస్తుతం 38 కరోనా యాక్టివ్​ కేసులున్నాయి. వీరందరూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

10:57 April 18

గుజరాత్​లో 48కి చేరిన కరోనా మృతులు

గుజరాత్​లో కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్​-19 కేసుల సంఖ్య 1272కు చేరింది. ఇందులో 88 మంది పూర్తిగా కోలుకోగా.. 48 మంది మరణించారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

10:11 April 18

రాజస్థాన్​లో 1270కి చేరిన కేసులు

రాజస్థాన్​లో మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​-19 మృతుల సంఖ్య 19కి చేరింది. కొత్తగా 41 కరోనా పాజిటివ్​ కేసులు బయటపడినందున.. మొత్తం కేసుల సంఖ్య 1270కి చేరింది.

08:56 April 18

అగ్రరాజ్యంలో ఉగ్రరూపం

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఇప్పటివరకు 35 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

2 లక్షల మంది బాధితులు న్యూయార్క్​లోనే ఉన్నారు. ఆ నగరంలో మృతుల సంఖ్య 14 వేలు దాటింది. 

అమెరికాలో ఇప్పటివరకు 37.8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

08:49 April 18

నౌకా దళంలో కరోనా కలకలం

భారత నౌకాదళంలో కరోనా కలకలం రేపింది. పశ్చిమ నావల్ కమాండ్ పరిధిలో 20 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. బాధితులంతా ఐఎన్​ఎస్​ ఆంగ్రేలో పనిచేసే వారని తెలిసింది. వీరంతా నౌకాదళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

08:29 April 18

కరోనా పంజా: 24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు

దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 991 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 14,378
  • యాక్టివ్ కేసులు: 11,906
  • మరణాలు: 480
  • కోలుకున్నవారు: 1,991
  • వలస వెళ్లిన వారు: 1

Last Updated : Apr 18, 2020, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.