ETV Bharat / bharat

చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి! - badam_painting

సుష్మా స్వరాజ్​ మృతికి ఆమె అభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ కళాకారుడు ఒక్క అంగుళం బాదం పప్పుపై చిత్రపటాన్ని గీసి శ్రద్ధాంజలి ఘటించాడు. ఆమె నుంచి పొందిన సహాయం మరువలేనిదని సోషల్​ మీడియా వేదికగా తెలిపారు.

చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!
author img

By

Published : Aug 8, 2019, 6:14 PM IST

చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!
మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగారు. మహిళా సాధికారత కోసం పోరాడిన ఆమె.. తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ అభిమానుల్లో ఒకరు ఆమెకు వినూత్న నివాళి అర్పించారు.

ఉత్తర్​ ప్రదేశ్​ లఖీంపుర్​ జిల్లా కొత్తబస్తీకి చెందిన అమన్​ గులాటీ తనదైన శైలిలో సుష్మాస్వరాజ్​కు నివాళులర్పించారు. ఒక్క అంగుళం పొడవున్న బాదం పప్పుపై ​ఆమె బొమ్మ గీసి అభిమానాన్ని చాటుకున్నారు.

యూనిక్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​తో పాటు పలు దేశాల ప్రశంసలు అందుకున్న అమన్ విదేశాలకు వెళ్లేందుకు సుష్మా చేసిన సహాయం మరవలేనన్నారు. ​సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా ఉండే సుష్మ సాయం పొందిన లక్షలాదిమందిలో తానూ ఒకడినని గులాటీ తెలిపారు.

"మాజి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్​ రాజకీయ నాయకురాలైనప్పటికీ ఆమె ప్రజలతో మమేకం అయ్యి ఉండేవారు. సోషల్​ మీడియా దేశంలో ప్రతి ఒక్కరితో ఆమె అందుబాటులో ఉండేవారు. అదే విధంగా, నాకూ ఆమెతో అనుబంధం ఏర్పడింది. గతేడాది కళా విభాగంలో నాకో అవార్డు వచ్చింది. అందుకు నేను కెన్యాకు వెళ్లాల్సివచ్చింది. కొన్ని కారణాల వల్ల నా పాస్​పోర్ట్​ రాలేదు. లఖ్​నవూలోని పాస్​పోర్ట్​ కార్యాలయానికి పలు సార్లు వెళ్లినా ప్రయోజనం లేకపోయేసరికి నేను మంత్రికి ట్వీట్​ చేశాను. ఆమె వెంటనే స్పందించారు. అందుకే బాదం పప్పుపై ఇలా చిత్రీకరించి శ్రద్ధాంజలి తెలుపుతున్నాను. ఆమె లేని లోటు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. "
-అమన్​ గులాటీ, కళాకారుడు.

ఇదీ చూడండి:జమ్మూ జెండాకు రాంరాం..! తుపాకీ నీడలోనే కశ్మీర్​

Intro:Body:

z

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.