ETV Bharat / bharat

'నా ప్రియుడు వస్తాడు.. ఈ పెళ్లి వద్దు'

చివరి నిమిషంలో పెళ్లి వద్దని చెప్పి అందరికీ షాక్​ ఇచ్చింది ఓ తమిళనాడు మహిళ. కూతురు ప్రేమను అర్థం చేసుకున్న వధువు తల్లిదండ్రులు.. ఆమెను తన ప్రియుడికి అప్పగించారు.

last-minute-drama-in-wedding-ceremony-as-bride-says-my-lover-will-come-for-me
'నా ప్రియుడు వస్తాడు.. ఈ పెళ్లి వద్దు!'
author img

By

Published : Nov 1, 2020, 9:51 AM IST

Updated : Nov 1, 2020, 11:01 AM IST

'నా ప్రియుడు వస్తాడు.. ఈ పెళ్లి వద్దు'

తాళికట్టు శుభవేళ వరుడికి షాక్​ ఇచ్చింది ఓ వధువు. తమిళనాడు నీల్​గిరిస్​లోని మట్టకండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'నా ప్రియుడు నా కోసం వస్తాడు. ఈ పెళ్లి నాకొద్దు' అని వరుడు తాళి కట్టే సమయంలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది .

ఎట్టకేలకు ప్రేమను గెలిచి..

కరోనా నిబంధనల దృష్ట్యా.. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇరువురి కుటుంబ సభ్యులు. అక్టోబర్​ 29న ముహూర్తం పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో వధువు, తనకు ఈ పెళ్లి వద్దంటూ కుటుంబ సభ్యులను, వరుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తన ప్రియుడు వస్తున్నాడని చెప్పి పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయింది.

కూతురు ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు.. వధువును తన ప్రియుడికి అప్పగించారు. ఎట్టకేలకు తన ప్రేమను దక్కించుకుంది ఆ వధువు.

ఇదీ చదవండి:ఆకాశంలో కనువిందు చేసిన 'బ్లూ మూన్‌'

Last Updated : Nov 1, 2020, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.