రానున్న 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఒడిశా- బంగాల్ తీరాల్లోని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల వర్షాలు భారీగా కురుస్తాయని స్పష్టం చేసింది.
అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండమూ ఓ కారణమని ఐఎండీ పేర్కొంది. మరో రెండు రోజులు ఇలాగే కొనసాగుతుందని తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఛండిగఢ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
గుజరాత్, గోవా, కోంకన్, మధ్య మహారాష్ట్ర, మధ్య భారతంలోని పలు ప్రాంతాల్లో మరో 4-5రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది ఐఎండీ. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మరో 2-3రోజుల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
ఇదీ చూడండి:- భారీ వర్షాలతో నీట మునిగిన పోలీస్ స్టేషన్