రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఝార్ఖండ్ హైకోర్టు నవంబరు 27కు వాయిదా వేసింది. లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వటానికి ఇంకొంత సమయం కావాలని సీబీఐ కోరటమే ఇందుకు కారణం.
'లాలూ ప్రసాద్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇప్పటికే సగం శిక్షను అనుభవించారు. అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలి' అని అభ్యర్థించారు లాలూ తరఫు న్యాయవాది కపిల్ సిబల్. సీబీఐ కావాలనే కేసును వాయిదా వేయిస్తోందని ఆరోపించారు. అయితే ఈ వాదనల్ని సీబీఐ తోసిపుచ్చింది.
బెయిల్ వస్తే విడుదల
1990ల్లో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ మఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాణా కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి ఆయనపై 3 కేసుల్లో దోషిగా తేలారు. ఈ మూడు కేసుల్లో ఇదివరకే లాలూకు బెయిల్ వచ్చింది. కానీ దుమ్కా ట్రెజరీ కేసు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ మంజూరైతే లాలూ ప్రసాద్ జైలు నుంచి బయటకు వస్తారు.
ఇదీ చదవండి :'9న లాలూ రిలీజ్- 10న నితీశ్‌కు ఫేర్వెల్'