ETV Bharat / bharat

ఆర్​జేడీ ఎన్నికల పోస్టర్​లో లాలూ మాయం - తేజస్వీ యాదవ్​

బిహార్​ ఎన్నికల కోసం పట్నాలోని ఆర్​జేడీ ప్రధాన కార్యాలయం వద్ద సరికొత్త పోస్టర్​ను ఏర్పాటు చేశారు. ఈ భారీ పోస్టర్​లో తేజస్వీ యాదవ్ ఒక్కరే​ ఉన్నారు. అయితే ఇందులో ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ను విస్మరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. లాలూ జైలులో ఉన్నప్పటికీ.. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ తగ్గలేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Lalu missing from poster,  yuva  Tejashwi lords over party
ఆర్​జేడీ ఎన్నికల పోస్టర్​లో లాలూ మాయం
author img

By

Published : Sep 14, 2020, 10:36 PM IST

Updated : Sep 14, 2020, 10:44 PM IST

బిహార్​ రాజధాని పట్నాలో ఉన్న ఆర్​జేడీ(రాష్ట్రీయ జనతా దళ్​) ప్రధాన కార్యాలయం వద్ద తాజాగా ఏర్పాటు చేసిన ఎన్నికల పోస్టర్​.. పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ పోస్టర్​లో తేజస్వీ యాదవ్​ ఒక్కరే ఉండటం.. పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ లేకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

లాలూ ప్రసాద్​ యాదవ్​ వారసుడిగా తేజస్వీ యాదవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో జరగనున్న బిహార్​ ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థి కూడా ఆయనే. అయినప్పటీకీ.. పోస్టర్లలో ఆర్​జేడీ సుప్రిమోను విస్మరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

పసుపు రంగులో ఉన్న భారీ పోస్టర్​లో తేజస్వీ యాదవ్​ చిత్రం ఒక్కటే ఉంది. 'నయీ సోచ్​, నయా బిహార్​'(కొత్త ఆలోచనలు, సరికొత్త బిహార్​), "యువా సర్కార్​, అబ్​కీ బార్​(ఈసారి వచ్చేది యువ సర్కారే)" అన్న క్యాప్షన్లు​ కూడా పోస్టర్​లో కనపడుతోంది.

lalu-missing-from-poster-yuva-tejashwi-lords-over-party
తేజస్వీ యాదవ్​ పోస్టర్​

అయితే ఎన్నికల పోస్టర్​ నుంచి పార్టీ సుప్రిమో లాలూను తప్పించడంపై పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. లాలూ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ.. ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1997లో జనతాదళ్​తో విడిపోయి ఆర్​జేడీని స్థాపించినప్పటి నుంచి.. లాలూ వ్యక్తిత్వం ప్రజలను ఆకర్షిస్తూనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ చూడండి-

Last Updated : Sep 14, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.