తమిళనాడులోని తిరుచ్చి లలితా జ్యూవెలరీ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు, 'మనసా వినవే', 'ఆత్మ' సినిమాల కథానాయకుడు సురేశ్.. కోర్టులో లొంగిపోయాడు. రూ. 13 కోట్ల విలువైన ఆభరణాల చోరీ ఘటన ఈ నెల 2న జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసి 5 కిలోల ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సురేశ్‌తో పాటు ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న మురుగన్ తెలుగు రాష్ట్రాల్లో తలదాచుకుని ఉండొచ్చని భావించి ఓ పోలీసు బృందం అక్కడికి వెళ్లింది.
తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో మేజిస్ట్రేట్ విఘ్నేష్ ప్రభు ఎదుట గురువారం మధ్యాహ్నం సురేశ్ లొంగిపోయాడు. న్యాయస్థానం అతడికి 15రోజులు రిమాండ్ విధించారు. పోలీసులు సురేశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: గోడకు కన్నం వేసి.. లలితా జ్యువెలరీలో భారీ చోరీ!