బిహార్ లఖీసరాయ్ జిల్లా సూర్యగఢలో ఘోర ప్రమాదం జరిగింది. ఛాన్నియా ఘాట్ వద్ద నదిలో ఓ పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో పడవలో 40-50 మధ్య ఉన్నారని తెలుస్తోంది. ఇందులో ఐదుగురి ఆచూకీ గల్లంతయింది. వారికోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. మిగతావారిని నది ఒడ్డుకు చేర్చారు. వీరిలో కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: విమానం టేకాఫ్‌లో సమస్య... ప్రయాణికుల దింపివేత