ETV Bharat / bharat

లాలూ పార్టీ గుర్తుపై శరద్​ యాదవ్​ పోటీ - Lalu prasad Yadav

శరద్​ యాదవ్​, లాలూ ప్రసాద్​ యాదవ్​...! ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. బిహార్​లో పోటీ వారిద్దరి పార్టీల మధ్యే. తర్వాత అనేక నాటకీయ మలుపులు. లోక్​తాంత్రిక జనతా దళ్​ పేరిట కొత్త పార్టీ పెట్టారు శరద్​. ఇప్పుడు ఆ పార్టీని ఆర్జేడీలో విలీనం చేయాలని నిర్ణయించారు.

లాలూ పార్టీ గుర్తుపై శరద్​ యాదవ్​ పోటీ
author img

By

Published : Mar 22, 2019, 7:41 PM IST

Updated : Mar 23, 2019, 7:50 AM IST

లాలూ పార్టీ గుర్తుపై శరద్​ యాదవ్​ పోటీ

బిహార్​లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఆ రాష్ట్రంలోని 40 స్థానాల్లో లాలూ ప్రసాద్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్‌-ఆర్జేడీ 20 స్థానాలు, కాంగ్రెస్‌ 9 స్థానాలు పొందాయి. రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ-ఆర్‌ఎల్‌ఎస్‌పీ 5, వికాషీల్‌ ఇన్సాన్‌ పార్టీ-వీఐపీ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా-హెచ్‌ఏఎమ్‌కు 3 సీట్లు కేటాయించారు.

మాజీ జనతా దళ్‌(యునైటెడ్‌) అధ్యక్షుడు, ఒకప్పటి ఎన్డీఏ కన్వీనర్‌ శరద్‌ యాదవ్‌ ఆర్జేడీ నుంచి బరిలో ఉండనున్నారు. ఎన్నికల అనంతరం ఆయన పార్టీ 'లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌-ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేయనున్నారు.

బిహార్‌లో మొదటి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్‌ల పర్వం మార్చి 25న ముగియనుంది.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 23, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.