ETV Bharat / bharat

భాజపా గూటికి కుష్బూ- లాభం ఎవరికి?

author img

By

Published : Oct 14, 2020, 11:41 AM IST

రాజకీయ నాయకురాలిగా మారిన నటి కుష్బూ.. కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరారు. ఆరేళ్లు అధికార ప్రతినిధిగా పనిచేసిన తర్వాత హస్తం పార్టీకి గుడ్​ బై చెప్పేశారు. తమిళనాట అభినయంతో ఎంతో ఆదరణ దక్కించుకున్న కుష్బూ కాంగ్రెస్​ను వీడటానికి బలమైన కారణాలే ఉన్నాయనే వాదనలు ఓవైపు.. ఇన్నాళ్లూ విమర్శలు గుప్పించిన భాజపాలో చేరటం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు మరోవైపు. ఇంతకీ కుష్బూ ఇమేజ్​ తమిళనాడులో భాజపాకు కలిసొస్తుందా? లేదంటే భాజపాలో చేరటం కుష్బూనే అందలం ఎక్కిస్తుందా ? మొత్తంగా కాషాయ కండువా కప్పుకున్న కుష్బూ భవిష్యత్ ప్రణాళికలెలా ఉండనున్నాయి ?

Kushboo joins BJP
భాజపాలో చేరిన కుష్బూ.. భవిష్యత్​ ప్రణాళికలేంటి ?

కుష్బూ కాంగ్రెస్​ను వీడటం తమిళనాట ఆ పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్​ తరఫున కీలకంగా ఉన్న ఒకప్పటి హీరోయిన్... పార్టీని వీడటానికి కారణాలుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఒకటుంది. అదేంటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో కుష్బూ ఎంపీ సీటు ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. అలకబూనిన నాయకురాలు.. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హస్తానికి గుడ్​బై చెప్పి.. కమలదళంలో చేరిపోయారంటున్నారు. ​

కుష్బూ ఇమేజ్​

రాజకీయాల్లో కుష్బూకు ఆధునిక భావాలున్న నాయకురాలిగా పేరుంది. మరోవైపు తమిళనాడులో భాజపాపై సంప్రదాయ పార్టీగా ముద్రపడింది. ఈ నేపథ్యంలోనే కుష్బూ ఇమేజ్​ పార్టీకి పనికొస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. కాషాయ కండువా కప్పుకున్న అనంతరం చెన్నైకు చేరిన కుష్బూకు భాజపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. గతంలో చేరిన నమిత, గౌతమికి ఇంత ప్రాధాన్యం దక్కలేదు. కుష్బూకు తమిళ ప్రజల్లో మంచి ఫాలోయింగ్​ ఉండటం, రానున్న ఎన్నికల్లో కుష్బూను పార్టీ ముందుంచాలని భావించటమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.

Kushboo joins BJP
భాజపా శ్రేణుల ఘనస్వాగతం

కాంగ్రెస్​తో ఆరేళ్ల సావాసం

కుష్బూ కాంగ్రెస్​లో ఉన్నపుడు అధికార ప్రతినిధిగా ఆరేళ్లు కొనసాగారు. కాంగ్రెస్​ ఆమెకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యమిచ్చింది. అయితే, కోరినట్లుగా ఎంపీ స్థానం మాత్రం కేటాయించలేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుంచే కుష్బూ కాంగ్రెస్​ను వీడతారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇదీ చూడండి: కుష్బూ బర్త్​డే: వెండితెర నుంచి రాజకీయాల వరకు!

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కుష్బూ అసంతృప్తిని భాజపా సొమ్ము చేసుకుంది. తమిళనాడు భాజపా అధ్యక్షుడు మురుగన్ కుష్బూ పార్టీలో చేరటంలో కీలక పాత్ర పోషించారు.

మురుగన్​ ప్రయత్నం

గత నెలలోనే మురుగన్ ఆమెతో సమావేశమయ్యారు. అయితే, వెంటనే కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి.. బుజ్జిగింపు చర్యల్లో భాగంగా పలుమార్లు కుష్బూను కలిశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా పెరంబూర్​లో జరిగిన ధర్నాలో భాజపాపై విమర్శలు సైతం చేశారు. ఈ సంఘటనల అనంతరం కాంగ్రెస్​లోనే కొనసాగుతారని అంతా భావించారు.

భారీ హామీలు !

అయితే, నెల రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. భాజపా నుంచి వచ్చిన ఆఫర్లతో.. కుష్బూ ఆ పార్టీలో చేరిపోయారు. పార్టీలో జాతీయ స్థాయి పదవితో పాటు, రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు, పార్టీ తరఫునే పూర్తి ఎన్నికల ఖర్చు వంటి హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా కుష్బూ ఇమేజ్​ తమిళనాట వాడుకుని పార్టీని బలోపేతం చేయాలని కమలదళం యోచిస్తోంది. భాజపాలో చేరినా.. పెరియార్​ విధానాలనే అనుసరిస్తానని స్పష్టంచేశారు కుష్బూ.

Kushboo joins BJP
భాజపాలో చేరిన కుష్బూ

భాజపాకు లాభమే !

మరోవిధంగానూ భాజపాకు కుష్బూ చేరిక కలిసిరానుంది. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కుష్బూ.. ముస్లిం కుటుంబంలో జన్మించారు. అటువంటి నేతకు జాతీయ స్థాయిలో పదవి, ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వటం ద్వారా.. తమిళనాడులో భాజపా హిందువుల పార్టీ మాత్రమే కాదనే సంకేతాలు పంపించాలని కాషాయ నేతలు యోచిస్తున్నారు.

Kushboo joins BJP
కుష్బూకు తమిళ ప్రజల్లో మంచి ఫాలోయింగ్​

కాస్త ఆగాల్సిందే

అయితే, తన 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో.. కుష్బూ ఇప్పటికే 3 పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది.

భాజపాలో చేరికతో తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కుష్బూ భావిస్తున్నారు. అయితే, వెండితెర​పై మాయాజలం చేసిన కథానాయిక, అభిమానాన్ని ఓట్లుగా మల్చుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే ! ఇతర ద్రవిడ నేతల్లాగా బలమైన సిద్ధాంతాలు లేని కుష్బూ.. భాజపాలో ఎలా నెగ్గుకొస్తారనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

ఇదీ చూడండి: భాజపాలో 'సింధియా' ఒంటరి పోరు- ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.