కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అగ్ర దేశాలన్ని వైరస్ ధాటికి ఆర్థికంగా కుదేలయ్యాయి. అగ్ర దేశాల పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్య చిరు వ్యాపారస్థుల పరిస్థితి.. అత్యంత దయనీయంగా మారింది. ఈ దుర్భర పరిస్థితుల్లో హరియాణా కురుక్షేత్రకు చెందిన రాజ్‌కుమార్ అనే టీ షాపు యజమానికి.. వ్యాపారం లేక ఆర్థికంగా బాగా కుంగిపోయాడు. కుటుంబ భారం కష్టంగా మారింది. దీంతో చేసేదీ ఏమీ లేక బ్యాంక్‌లో రుణం తీసుకోవాలని అనుకున్నాడు. బ్యాంక్‌కు వెళ్లి అర్జీ పెట్టుకున్నాడు. కానీ బ్యాంక్ అధికారి చెప్పిన మాటలకు రాజ్‌కుమార్ షాకయ్యాడు..
ఇప్పటికే అతని పేరు మీద రూ.50 కోట్లు అప్పు ఉందని.. అది కట్టిన మరుక్షణమే, కొత్త రుణాన్ని మంజూరు చేస్తామని రాజ్‌కుమార్ అర్జీని తిరస్కరించారు ఆ బ్యాంక్ అధికారి.
కరోనా కాలంలో ఆర్థికంగా కుంగిపోయిన నేను రుణం కోసం బ్యాంక్‌లో అర్జీ పెట్టుకున్నాను. అప్పటికే నా పేరు మీద రూ.50 కోట్ల అప్పు ఉందని.. నా అర్జీని బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. ఇది ఎలా సాధ్యమైందో అర్ధం కావటం లేదు.
-రాజ్‌కుమార్, టీ వ్యాపారి
ఇదీ చూడండి:క్వారంటైన్ కేంద్రంలో 'మురళీ' గానం.. చిందేసిన రోగులు