ETV Bharat / bharat

భక్తజన సంద్రం

జనవరి 15న ప్రయాగ్​రాజ్​లో ప్రారంభమైన అర్ధ కుంభమేళా నేటితో ముగియనుంది. ఇప్పటి దాకా 22 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

author img

By

Published : Mar 4, 2019, 6:12 AM IST

Updated : Mar 4, 2019, 7:51 AM IST

పవిత్ర స్నాాానాలు ఆచరిస్తున్న భక్తులు

నిత్యం భక్తజన కోటి పవిత్ర స్నానాలు.. హరహర గంగ నినాదాలు.. శివన్నామస్మరణతో అంతులేని ఆధ్యాత్మికత వెల్లివిరిసిన ప్రయాగ్​రాజ్​ అర్ధ కుంభమేళా నేటితో ముగియనుంది. కుంభమేళా ముగింపు, మహాశివరాత్రి పర్వదినం ఒకేరోజు రావడం మరో విశేషం.

ప్రయాగ్​రాజ్​లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమానికి భక్తులు పోటెత్తారు. నేడు ఒక్కరోజే దాదాపు కోటి మంది పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు.

భక్తజన సంద్రమైన ప్రయాగ్​రాజ్​

22 కోట్ల మంది

మకర సంక్రాంతి రోజైన జనవరి 15న ప్రయాగ్​రాజ్​లో అర్ధకుంభమేళా ప్రారంభమైంది. ఇప్పటి దాకా 22 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది.

మకర సంక్రాంతి, మౌనీ అమావాస్య, వసంత పంచమి, పౌష్​ పూర్ణిమ, మాఘీ పూర్ణిమ పర్వదినాల్లో కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. పెద్దలను స్మరిస్తూ తర్పణాలు వదిలారు. కుంభమేళాలో స్నానం సర్వపాప హరణం అనేది భక్తుల విశ్వాసం.

భద్రత నడుమ ప్రశాంతంగా..

పటిష్ఠ భద్రత నడుమ ప్రయాగ్​రాజ్​లో కుంభమేళా ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 20వేల మంది పోలీసులు, ఆరువేల మంది హోంగార్డులు, 40 పోలీస్​స్టేషన్లు, 50 అవుట్​పోస్టులు, 40 ఆగ్నిమాపక కేంద్రాలు, 80 కంపెనీల కేంద్ర బలగాలు, 20 కంపెనీల పీఏసీలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

ఉగ్రవాద నిర్మూలన దళం కమాండోలు, బాంబులు నిర్వీర్యం చేసే బృందాలు, ఇంటెలిజెన్స్​ యూనిట్లనుభద్రత కోసం ప్రత్యేకంగా నియమించారు.

ఈ కుంభమేళాలో సాంకేతికతను అధికంగా వాడారు. భద్రతతో పాటు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు.

AP Video Delivery Log - 1700 GMT News
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1637: Space ISS SpaceX Crew AP Clients Only 4198972
ISS crew celebrate arrival of SpaceX capsule
AP-APTN-1613: Egypt Tomb AP Clients Only 4198973
Ancient Alexandria tomb to open for tourists
AP-APTN-1603: France Algeria AP Clients Only 4198971
Algerians in Paris protest against Bouteflika
AP-APTN-1557: Syria Begum Husband No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4198968
Begum's husband says both were wrong to join IS
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 4, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.