సాగు నీరు కేటాయించాలని కర్ణాటక మండ్య రైతులు చేపట్టిన ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. కావేరీ, హేమావతి నదుల జలాలను కాల్వల ద్వారా పంటపొలాలకు తరలించాలని రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో మంగళవారం బెంగళూరు వెళుతున్న మంత్రి డీకే శివకుమార్ వాహనాన్ని అడ్డుకున్న రైతులు తమ డిమాండ్లను విన్నవించారు.
"ఈ విషయంలో నేనేమీ చేయలేదు. ఆ శాఖ నా చేతిలో లేదు. నీటి నిర్వహణ యాజమాన్యంతో నేను మాట్లాడుతా"నని మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వాల్మీకి కోటా కోసం...
తమ సమాజానికి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని విధాన సౌధ ఎదుట ధర్నాకు దిగారు వాల్మీకి వర్గం మద్దతుదారులు. జనాభా ఆధారంగా కోటా కల్పించాలని వాల్మీకి సమాజం ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ట్రాఫిక్‌లో మంత్రి డీకే శివకుమార్ చిక్కుకుపోయారు.
మెట్రోలో మంత్రి
అక్రమ ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టుకు హాజరుకావాల్సిన మంత్రి శివకుమార్...విధాన సౌధ వద్ద ట్రాఫిక్ కారణంగా మెట్రోలో ప్రయాణించారు.
ఇదీ చూడండి: 'నీటి బిల్లును మా సీఎం ఎప్పుడో చెల్లించారు'