అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను నాశనం చేస్తున్న నేటి కాలంలో.. ఓ వ్యక్తి అంతరించిపోతున్న వృక్ష జాతుల సంరక్షణకు నడుంకట్టారు. మానవుల సుఖమయ జీవనానికి సంజీవని లాంటి ఔషధ మూలికలను అత్యంత శ్రమకోర్చి ఆయన సేకరిస్తున్నారు. ఆయనే కర్ణాటక శివమొగ్గకు చెందిన పర్యావరణవేత్త బి. వెంకటగిరి.
వెంకటగిరి తన ఇంట్లోనే 500కి పైగా అత్యంత అరుదైన ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అంతరించే దశలో ఉన్న సుమారు 1500 రకాల మూలికల విత్తనాలను సేకరించారు. యువతరానికి ఈ వనమూలికల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
"నేను 40 ఏళ్ల నుంచి అంతరించిపోతోన్న అరుదైన మొక్కలపై పరిశోధన చేస్తున్నాను. సీతాశోక, నాగకేశర, నాగలింగ పుష్ప ఇలాంటి పవిత్రమైన మొక్కలను కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాను. వాటి విత్తనాలను సేకరించి నర్సరీలో పెంచుతున్నాను. అంతేకాదు కళాశాలల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ నీరు ఉంటే అక్కడ వీటిని పెంచుతున్నాను. ."- వెంకటగిరి, పర్యావరణవేత్త
వెంకటగిరి.. పవిత్ర గ్రంథాల్లో పేర్కొన్న నవగ్రహవన, నందనవన, పవిత్రవన, అశ్వినీ వన లాంటి మూలికా మొక్కలను పెంచుతున్నారు. వాటిని ఎలా పెంచాలనే విషయంలో ఓ ప్రత్యేక పద్ధతినీ రూపొందించారు.
ఇదీ చూడండి: అసోం పాటకు అమెరికా సైనికుల ఆట