కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలలోగా కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. కానీ సభలో బలపరీక్ష జరగలేదు. చర్చ జరగనిదే బలనిరూపణ కుదరదంటూ కూటమి సభ్యులు ఆందోళన చేస్తున్నారు. బలపరీక్ష నిర్వహించాలంటూ భాజపా డిమాండ్ చేస్తోంది.
అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్ రమేశ్ కుమార్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం చర్చ కొనసాగనుంది.
ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత సీఎం కుమారస్వామి భాజపాపై.. విమర్శల వర్షం కురిపించారు. ‘
సీఎం వ్యాఖ్యలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ చెప్పిన ప్రకారం బలపరీక్ష జరిపి తీరాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ.. ‘చర్చ జరగకుండా ఓటింగ్ నిర్వహించే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
స్పీకర్ నిర్ణయంతో భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సంకీర్ణ నేతలతో వాగ్వాదానికి దిగారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ సభను వాయిదా వేశారు.