మోదీకి మద్దతుగా మాట్లాడాలంటూ కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోరింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు పార్టీ నేతలు కలిశారని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముళ్ళపల్లి రామ్‌చంద్రన్ అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల, మరో ముగ్గురు పార్టీ ఎంపీలు - కె. మురళీధరన్, బెన్నీ బెహన్నన్, టి. ఎన్. ప్రతాపన్... థరూర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
థరూర్ వ్యాఖ్యలు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలకు బాధ కల్గించాయి. ఇది పార్టీకి మంచిది కాదు. పార్టీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించిందని, వెంటనే ఆయన సంజాయిషీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు.
-రామచంద్రన్, కేపీసీసీ చీఫ్
విదేశీ పర్యటనలో ఉన్న థరూర్ స్పందిస్తూ మోదీ ప్రభుత్వం పట్ల నేను తీవ్ర విమర్శకుడిని. తోటి పార్టీ నేతలంతా తన వైఖరిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రాజ్యాంగం పట్ల ఉన్న నిబద్ధత, తాను పాటించిన నైతిక విలువలు ఇప్పటికి 3 సార్లు ఎన్నికలలో తనను గెలిపించాయని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి : కరాచీలోని 3 గగనతలాల్ని మూసేసిన పాకిస్థాన్