ETV Bharat / bharat

కోజికోడ్​ ఘటనలో 16 మృతదేహాల అప్పగింత - కేరళ విమాన ప్రమాదం న్యూస్​

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన 16 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు అధికారులు. పైలట్​ దీపక్​ సాథే భౌతికకాయాన్ని ముంబయి తీసుకెళ్లనున్నారు. కో-పైలట్​ మృతదేహానికి మథురలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ మేరకు ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ తెలిపింది.

Kozhikode crash: Mortal remains of 16 passengers handed over to families
కోజికోడ్​ ఘటనలో 16 మంది మృతదేహాల అప్పగింత
author img

By

Published : Aug 9, 2020, 4:22 PM IST

కేరళ కోజికోడ్​ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్​ తెలిపింది. పైలట్​ దీపక్​ సాథే భౌతికకాయాన్ని ఇప్పటికే కొచ్చిన్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరుసటి రోజు ముంబయి తరలించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఎయిర్​ ఇండియా​.

కో-పైలట్ అఖిలేష్​​ కుమార్​ స్వస్థలమైన మథురలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ అధికారులు గౌరవంగా వీడ్కోలు పలికారు.

కోజికోడ్​లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 149 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 23 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

ఇదీ చూడండి: 'కో-పైలట్​ను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించాం.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.