ETV Bharat / bharat

బడి పిల్లల పొలం బాట- సర్కార్​ వైఖరే కారణం! - types of agriculture

సాధారణంగా బడిపిల్లలు ఎక్కడుంటారు? అదేం ప్రశ్న... పాఠశాలలో ఉంటారు లేదా ఇంట్లో ఉంటారు.. అంటారా? అవును, అదీ నిజమే. ఈ కాలంలో పిల్లలు అంతకు మించి ఇంకో పని చేసే అవకాశమెక్కడుంది! కానీ, ఈ చోట మాత్రం బడిపిల్లలంతా పొలాల్లో వ్యవసాయం చేసేందుకు దిగుతున్నారు. జానపద పాటల వింటూ పని చేస్తున్నారు. ఎడ్ల పందేలు చూస్తూ కేరింతలు కొడుతున్నారు. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ కొత్త పథకం!

బడి పిల్లల పొలం బాట- సర్కార్​ వైఖరే కారణం!
author img

By

Published : Oct 19, 2019, 6:01 AM IST

బడి పిల్లల పొలం బాట- సర్కార్​ వైఖరే కారణం!

'ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు, సొలుపేమున్నది' అని ఓ కవి రాసిన అక్షర సత్యాన్ని ఈ తరం పిల్లలకు తెలియచెబుతోంది కేరళ ప్రభుత్వం. విద్యార్థుల్ని పొలం బాట పట్టించి... ఘన సంస్కృతిని కాపాడుకునేందుకు యత్నిస్తోంది.

పల్లెకు పోదాం చలో చలో...

కేరళ రాష్ట్ర విద్యా, వ్యవసాయ శాఖలు ఉమ్మడిగా 'సురక్షిత కొల్లం జిల్లా' కార్యక్రమం నిర్వహించాయి. పూర్వం జానపద పాటలతో వ్యవసాయం చేసిన రోజులను కళ్లకుకట్టేలా ఏర్పాట్లు చేసి.. బడి పిల్లలకు సేద్యంలోని మాధుర్యాన్ని రుచి చూపించే వినూత్న కార్యక్రమం చేపట్టాయి. విద్యార్థులను బడి నుంచి నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లి యూనిఫాంలోనే వారితో వ్యవసాయం చేయించారు అధికారులు.

నిత్యం ఇరుకు గదుల్లో, గంపెడు సిలబస్​లతో భారంగా గడిపే వారు వీరంతా. ఇలా గాలికి ఎగిరే సీతాకోకల్లా.. వరిపైరు చేత పట్టి, మడిలో నాటుతుంటే కొత్తగా అనిపించింది వారికి. భవిష్యత్తులో తామూ వ్యవసాయం చేసుకుని, లాభాలు అర్జిస్తూ బతికేయొచ్చన్న భరోసా కలిగించింది.

జోడెడ్ల పందెం పెట్టి..

పల్లెటూరి పరిమళం ఉట్టిపడేలా సంప్రదాయ జోడెద్దుల పందేలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఉత్సవంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 25 జతల ఎద్దులు పాల్గొన్నాయి.

చాలా రోజులుగా శిక్షణ పొందిన మేలు జాతి ఎద్దులు.. సత్తా చాటేందుకు బురద మడిలో బిరబిరా పరుగులు తీశాయి. వాటిని చూసేందుకు వచ్చిన జనం ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.

జన-పెదాలపై పాత పల్లవి

జానపద పాటలు చరిత్రను వివరించే సాధకాలు. పూర్వం పల్లెటూరిలో సమూహాలుగా పనులు చేస్తూ రాగయుక్తంగా మాటలాడుకునే ముచ్చటలు. అందుకే కేరళ ప్రభుత్వం జానపదాలను ఆలపింపజేసి, వీక్షకులను ఆకట్టుకుంది.
ఇదీ చూడండి:మృగరాజు ముందు మందుబాబు వేషాలు!

Satara (Maharashtra), Oct 17 (ANI): Prime Minister Narendra Modi said that Indian security forces are at par with forces of other countries. Addressing a public rally in Maharashtra's Satara, PM Modi said, "In the last 5 years, our government has brought our armed forces at par with the armed forces of other countries. Be it Army, Navy or Air Force, modern weapons are a part of our armed forces today." Taking jibe at the Opposition on failure in Lok Sabha election, PM Modi further added, "Congress-NCP leaders are unable to understand the mood of the people. They were punished in the Lok Sabha elections. This time the people will give them harsh punishment in the upcoming elections too, be it in Maharashtra or Haryana." Maharashtra Assembly Polls will be held in one phase on October 21, and the results will be declared on October 24.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.