పునాదులు పూర్తి..
తొలిదశలో భాగంగా 43 ఇళ్లను నిర్మిస్తున్నారు. దాదాపు వీటి పునాదుల పని పూర్తయింది. నిర్మాణ పనులన్నీ కుటుంబ శ్రీ మిషన్ కింద మహిళలే చేస్తున్నారు.
రెండు పడక గదులు
వరద బాధితుల కోసం 'ఈనాడు' నిర్మిస్తున్న ఈ ఇళ్లలో రెండు పడక గదులు ఉండనున్నాయి. అలాగే హాలు, వంటగది, బాత్రూం సౌకర్యాలు ఉంటాయి.
లక్ష్యం 116
రూ.7కోట్ల70 లక్షల 'ఈనాడు సహాయ నిధి'తో మూడు దశల్లో మొత్తం 116 ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం. కలెక్టరు కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఈ ఇళ్ల పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. మార్చి 2న ఇళ్ల నిర్మాణాలను శంకుస్థాపన జరిగింది.