ETV Bharat / bharat

కేరళ ప్రభుత్వ బడుల 'హైటెక్'​ ఘనత - హైటెక్​ క్లాస్​రూమ్​

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను హైటెక్​ క్లాస్​రూమ్​లుగా మార్చింది కేరళ. ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ ఘనత సాధించడం గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​.

Kerala has become first state to have hi-tech classrooms in all public schools, says CM
కేరళ ప్రభుత్వ పాఠశాలల 'హైటెక్'​ ఘనత
author img

By

Published : Oct 12, 2020, 7:39 PM IST

సాంకేతికతపరంగా దూసుకుపోతున్న కేరళ.. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు హైటెక్​ క్లాస్ ​రూమ్​లుగా మారాయి. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రకటించారు. ఈ ఘనత సాధించడం పట్ల ఎంతో గర్వంగా ఉందన్నారు.

క్లాస్​రూమ్​లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్ది, హెటెక్​ ఐటీ ల్యాబ్​లను ఏర్పాటు చేసినట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ అత్యాధునిక వ్యవస్థతో విద్యార్థులు లబ్ధిపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా లాప్​టాప్స్​, ప్రొజెక్టర్స్​, వెబ్​క్యామ్స్​, ప్రింటర్సతో సహా 3లక్షలకుపైగా డిజిటల్​ పరికరాలను సమకూర్చినట్టు వెల్లడించారు విజయన్​.

"ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతులను హైటెక్​ క్లాస్​రూమ్​లుగా మలచిన తొలి రాష్ట్రం కేరళ. సమాజంలో ఉన్న అందరికీ విద్య అందించాలన్న దృఢ నిశ్చయంతో ఈ మిషన్​ సాధ్యపడింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి ఎంతో గర్వంగా ఉంది. రాష్ట్రంలోని విద్యార్థులు ముందడుగు వేసేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థ ఉపయోగపడుతుంది."

--- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం.. ఈ 'ఎడ్యుకేషన్​ రెజువనేషన్​' మిషన్​ను కైట్​(కేరళ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అండ్​ టెక్నాలజీ ఫర్​ ఎడ్యుకేషన్​) చేపట్టింది. కేరళ మౌలిక వసతుల పెట్టుబడి నిధుల బోర్డు(కేఐఐఎఫ్​బీ) నిధులు సమకూర్చింది. ఫలితంగా ఇప్పటివరకు 42వేల క్లాస్​రూమ్​ల్లో(8-12 తరగతులు) ల్యాప్​టాప్స్​, ప్రొజెక్టర్స్​, స్క్రీన్​లను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిల్లో కనీసం ఒక్క స్మార్ట్​ క్లాస్​రూమ్​ అయినా ఉండేటట్టు చూసుకోవాలని ఆదేశాలిచ్చారు.

ఇదీ చూడండి:- 'ఆ కేరళ విద్యార్థినిని రాష్ట్ర అతిథిగా గౌరవిస్తాం​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.