ETV Bharat / bharat

కరోనా కట్టడి కోసం కేరళలో సెక్షన్​-144 అమలు - Section 144 imposed in Kerala

కేరళలో కరోనా కోరలు చాస్తోంది. ఈ తరుణంలో కేసులను కట్టడి చేసేందుకు సన్నద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. సెక్షన్​-144 విధిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఒకేచోట ఐదుగురికి మించి సమావేశమవడం నిషేధం. ఈ నిబంధనలు అక్టోబర్​ 3 నుంచి 31 వరకు వర్తిస్తాయని పేర్కొంది.

Kerala govt imposes Section 144 to curb coronavirus spread
కరోనా కట్టడి కోసం కేరళలో సెక్షన్​-144 అమలు
author img

By

Published : Oct 2, 2020, 1:31 PM IST

Updated : Oct 2, 2020, 2:17 PM IST

కేరళలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కేసులను అరికట్టేందుకు లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్​ సర్కార్​. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​ను విధిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం విధించిన తాజా నిబంధనలు అక్టోబర్ 3 ఉదయం 9గంటల నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వాస్​ మెహతా పేర్కొన్నారు. ఈ నెల​ 31 వరకు సెక్షన్​-144 అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కరోనాను నియంత్రించేందుకు భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఒకేచోట ఐదుగురికంటే ఎక్కువ మంది సమావేశమవడాన్ని నిషేధించింది. అయితే.. శుభకార్యాలు, అంత్యక్రియలు మొదలగువాటికి సడలింపు ఉంటుంది. వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న కంటైన్​మెంట్​ జోన్​లలో మాత్రం ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉండనున్నాయి.

మలయాళీ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 8 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 2లక్షల మార్కును దాటింది. ఇప్పటివరకు అక్కడ 771మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: భారత్​లో లక్షకు చేరువైన కరోనా మరణాలు

Last Updated : Oct 2, 2020, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.