కేరళ కాసరగోడ్ జిల్లాకు చెందిన ఫాతిమా షమ్నా కేవలం 35రోజుల్లోనే 628ఆన్లైన్ డిప్లోమా కోర్సులను పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 'అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించింది. గతంలో 88రోజుల్లో 520కోర్సులను పూర్తి చేసిన రికార్డును తిరగరాసింది.
ఫాతిమా షమ్నా ప్రస్తుతం మెల్పరంబులోని ఎమ్ఈఎస్ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా కాలేజీ మూసివేయటంతో ఇంటినుంచే చదువును కొనసాగించింది. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్, యాలే, జార్జియా లో డిప్లోమా కోర్సులను ఆన్లైన్ ద్వారా అభ్యసించింది.
రోజుకు 20కోర్సులు
ఫాతిమా ఆగష్టు 25 నుంచి ప్రతిరోజు కనీసం 20కోర్సులను పూర్తి చేసేది. ఆమె పూర్తిచేసిన కోర్సుల్లో సైన్స్, గణితం, ఆరోగ్యం తదితర సబ్జెక్టులు ఉన్నాయి. ఈ రికార్డుతో 'పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం'అని నిరూపించింది. తనకు సహకరించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపింది ఫాతిమా.