కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మూడో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫాజిల్ ఫరీద్ వాంగ్మూలాన్ని కస్టమ్స్ అధికారులు తీసుకున్నారు. ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉన్న ఫాజిల్‌తో ఫోన్లో సంభాషించి వివరాలు సేకరించారు.
మరో ఇద్దరు నిందితులు స్వప్న సురేశ్, సందీప్ నయ్యర్‌కు కరోనా నెగటివ్ వచ్చిన నేపథ్యంలో సోమవారం ఎన్ఐఏ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు అధికారులు. విచారణ నిమిత్తం 10 రోజుల రిమాండ్ కోరనున్నారు. ఈ మేరకు బెంగళూరు నుంచి కోచి ఎన్ఐఏ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం..
కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సరిత్‌ను ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరి నలుగురిపై చట్టవ్యతిరేక కార్యక్రమాలు, యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఈ కేసు విచారణ కోసం కోచి డీసీపీ పూంగుళలి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు కేరళ డీజీపీ.
ఇదీ చూడండి: స్మగ్లింగ్ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'