ETV Bharat / bharat

ప్రత్యేక వార్డుకు కేరళ కరోనా బాధితురాలు.. దిల్లీలో మరో ఆరుగురు

కేరళలో కరోనా సోకిన విద్యార్థినిని  త్రిస్సూర్​ మెడికల్​ కాలేజీకి మార్చారు వైద్యులు.  ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. దిల్లీలోని ఆర్​ఎమ్​ఎల్ ఆసుపత్రిలో ఆరుగురు   కరోనా వైరస్​ అనుమానితులు చేరారు.

ప్రత్యేక వార్డుకు కేరళ కరోనా బాధితురాలు.. దిల్లీలో మరో ఆరుగురు
ప్రత్యేక వార్డుకు కేరళ కరోనా బాధితురాలు.. దిల్లీలో మరో ఆరుగురు
author img

By

Published : Jan 31, 2020, 3:40 PM IST

Updated : Feb 28, 2020, 4:14 PM IST

దేశంలో నమోదైన తొలి కరోనా కేసు​ తీవ్ర కలకలం రేపుతోంది.. కేరళలో కరోనావైరస్​ సోకినట్లు తేలిన ఓ వైద్య విద్యార్థినిని ప్రభుత్వాసుపత్రి నుంచి త్రిస్సూర్​వైద్య కళాశాలకు చేర్చినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశంలోని మిగతా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

వుహాన్​ వర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్న కేకే శైలజ.. కరోనా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరింది. కాగా, నిన్న ఆమెకు కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. నేడు ఆమెను త్రిస్సూర్​కు చేర్చారు. ఈ వైద్య కళాశాలలోని ప్రత్యేక వార్డును 24 మందికి ఒకే సారి చికిత్స అందించే విధంగా రూపొందించారు.

కరోనా వ్యాప్తి జరగకుండా కేరళ ప్రభుత్వం మరింత జాగ్రత్త వహిస్తోంది .. ఈ కారణంగా 1053 మంది అనుమానితులను పరిశీలనలో ఉంచింది.

దిల్లీలో ఆరుగురు..

ఇక దిల్లీలోని ఆర్​ఎమ్​ఎల్ ఆసుపత్రిలో కరోనా వైరస్​ లక్షణాలతో ఆరుగురు చేరారు. ​వీరిలో ఐదుగురు స్వతహాగా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఐదుగురు కూడా సుమారు నాలుగేళ్లుగా చైనాలో ఉన్నవారే.. పైగా వీరంతా ఈ నెలాఖరులోనే భారత్​కు వచ్చారు. వీరిని ప్రత్యేక వార్డులో పరీక్షలు నిర్వహించారు. అయితే, తుది నివేదిక వెలువడితే గానీ కరోనా నిర్ధరణ జరగదు. 21 విమానాశ్రయాల్లో అధికారులు ప్రయాణికులను పరీక్షిస్తున్నారు.

భారత్​ ముందు జాగ్రత్త...

భారత ప్రభుత్వం కరోనా వైరస్​ను గుర్తించేందుకు, ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా సిద్ధమైందని.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, హోం శాఖ, పౌర విమానయాన, సమాచార, కార్మిక, షిప్పింగ్​ విభాగాల సమన్వయంతో దేశం ముందుకెళుతోందని.. కేంద్ర కేబినేట్​ సెక్రటెరియేట్​ రాజీవ్​ గౌబా తెలిపారు.

అంతే కాదు, జనవరీ 15 తరువాత చైనా నుంచి భారత్​కు వచ్చేవారికి కరోనా పరీక్ష చేశాకే దేశంలోకి అనుమతించాలని ఇదివరకే నిర్ణయించింది ప్రభుత్వం.

ఎవరికైనా తీవ్ర అలసట, జలుబు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే 011-23978046 నెంబరుకు స్వచ్ఛందంగా ఫోన్​ చేసి తెలపాలని దేశ ప్రజలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. సరిహద్దు ప్రాంతాల మీదుగా చైనా నుంచి భారత్​కు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే..

చైనాలో ఇప్పటికే కరోనా బారినపడి 213మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9,692 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్​ వ్యాపించింది. భయంకర వైరస్​ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఇదీ చదవండి:ఆపరేషన్​ కరోనా: దిల్లీ నుంచి వుహాన్​కు ప్రత్యేక విమానం

Last Updated : Feb 28, 2020, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.