దేశంలో వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో మరో 12,134 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుల సంఖ్య 15,06,018కి పెరిగింది. వైరస్ సోకిన వారిలో మరో 302 మంది చనిపోయారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39,732కు చేరింది.
- కర్ణాటకలో ఒక్కరోజులోనే 10,913 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 6,90,269కు పెరిగింది. మరో 114 మరణాలతో కలిపి.. ఇప్పటివరకు అక్కడ మొత్తం 9,789 మృతిచెందారు.
- కేరళలో ఒక్కరోజు వ్యవధిలోనే 9,250 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 2,66,100కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 955 వైరస్ మరణాలు నమోదయ్యాయి.
- తమిళనాట మరో 5,185 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6,46,128కు చేరింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం 3,249 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4,30,666కు పెరిగింది. వైరస్ కారణంగా మరో 48 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 6,293కి చేరాయి.
- దిల్లీలో మరో 2,860 కేసుల్ని గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 3,03,693కు చేరింది. ఇవాళ 39 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 2,180 వైరస్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,54,785కు.. మరణాలు 1621కి పెరిగాయి.
ఇదీ చదవండి: అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి 'ప్లాస్టిక్ ఇటుకలు'