ETV Bharat / bharat

గృహహింస చట్టం కింద ఎంపీపై నటి కేసు - అనుభవ్​ మోహంతి

ఒడియా​ నటి బార్షా ప్రియదర్శిని.. ఆమె భర్త, కేంద్రపారా ఎంపీ అనుభవ్​పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. తనను భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కటక్​ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తనకు ఎలాంటి నోటీసు అందలేదని అనుభవ్ అన్నారు​.

Kendrapara MP Anubhav Mohanty wife moves court against husband for Domestic Violence, MP responds

author img

By

Published : Sep 5, 2020, 6:40 PM IST

ఒడిశా కేంద్రపారా ఎంపీ అనుభవ్​ మోహంతిపై ఆయన భార్య, ఒలివుడ్​ ప్రముఖ నటి బార్షా ప్రియదర్శిని.. మహిళా భద్రత, గృహహింస చట్టం కింద​ కేసు నమోదు చేశారు. అనభవ్ తనను భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

పరిహారం కింద.. ఇంటి అద్దె కోసం నెలకు రూ. 20వేలు, ఇతర అవసరాల కోసం నెలకు రూ. 50వేలతో పాటు రూ. 15 కోట్లు అనుభవ్​ నుంచి ఇప్పించాలని కోర్టును కోరారు ప్రియదర్శిని. కటక్​ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

అయితే ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. మరోవైపు ఈ విషయంపై తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని ఎంపీ అనుభవ్​ వెల్లడించారు.

అనుభవ్​- ప్రియదర్శిని వివాహం 2014లో జరిగింది. అయితే వీరి మధ్య విభేదాలు ఏర్పాడ్డాయని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఇదీ చూడండి:- కరోనా వేళ గుదిబండగా మారిన గృహహింస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.