ETV Bharat / bharat

గంభీర్​ క్షమాపణ చెప్పాల్సిందే : కేజ్రీవాల్​ - చట్టపరమైన చర్యలు

మాజీ క్రికెటర్​, భాజపా నేత గౌతమ్ గంభీర్​కు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ లీగల్ నోటీసు పంపారు. ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

'గంభీర్​ క్షమాపణ చెప్పు': కేజ్రీవాల్​
author img

By

Published : May 12, 2019, 7:29 AM IST

Updated : May 12, 2019, 11:07 AM IST

గంభీర్​ క్షమాపణ చెప్పాల్సిందే : కేజ్రీవాల్​

భాజపా నేత, మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ తనపై అభ్యంతరకర ట్వీట్లు చేశారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీర్ తనకు ​ వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్​ నోటీసులు పంపించారు.

తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన గంభీర్​.. ఈ నోటీసు అందిన 24 గంటల్లోనే తన ట్విట్టర్​ ఖాతాలో నిజమైన, సరైన వాస్తవాలను వెల్లడించాలని కేజ్రీవాల్​ డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గౌతమ్​ గంభీర్​ తూర్పు దిల్లీ లోక్​సభ స్థానం నుంచి భాజపా తరపున పోటీచేస్తున్నారు. ఆయనపై ఆమ్​ ఆద్మీ పార్టీ తరపున అతిశి మార్లేనా పోటీ చేస్తున్నారు. భాజపాపై, గంభీర్​ వ్యాఖ్యలపై అతిశి పరువునష్టం దావా వేశారు. ప్రతిగా గంభీర్​ ట్విట్టర్​లో మరోసారి కేజ్రీవాల్​ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.

"కేజ్రీవాల్​ లాంటి ముఖ్యమంత్రిని కలిగి ఉన్నందుకు సిగ్గుపడుతున్నా."

" మీ పార్టీ నేత అయిన ఓ మహిళ పట్ల మీ ధోరణిని నేను అసహ్యించుకుంటున్నా. ఇదంతా ఎన్నికల్లో విజయం సాధించడం కోసమేనా? మీరు వ్యర్థ ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి. మీ మెదడును శుభ్రం చేయడానికి మీ పార్టీ గుర్తు చీపురు అవసరం." -గౌతమ్ గంభీర్​, భాజపా నేత, మాజీ క్రికెటర్​

గంభీర్​ వ్యాఖ్యలపై ఆప్​ తరఫున మహమ్మద్​ ఇర్షాద్​ లీగల్​ పరువునష్టం దావా దాఖలు చేశారు. గంభీర్​ ట్వీట్లు పూర్తి నిరాధారంగా, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. గంభీర్​ ట్వీట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు.

ఇదీ చూడండి: 'టైమ్​​లో మోదీపై కథనం రాసింది పాకిస్థానీ'

AP Video Delivery Log - 2300 GMT News
Saturday, 11 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2233: Turkey Election Protest AP Clients Only 4210453
Istanbul demo against mayoral re-run
AP-APTN-2223: Albania Demo 3 AP Clients Only 4210452
Clashes outside Albanian government building
AP-APTN-2202: Albania Demo 2 AP Clients Only 4210449
Opposition protesters gather at Parliament building
AP-APTN-2200: Curacao Measles Ship AP Clients Only 4210451
Most aboard quarantined ship are safe from measles
AP-APTN-2104: Paraguay Floods AP Clients Only 4210450
Torrential rain in Paraguay causes heavy flooding
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 12, 2019, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.