ఆప్ ప్రభుత్వం దిల్లీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ స్వయంగా బస్సులో ప్రయాణించి.. ఈ పథకంపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలిసుకున్నారు.
"దిల్లీలోని అన్ని బస్సుల్లో నిన్న మహిళల రక్షణ కోసం బస్ మార్షల్స్‌ను ఏర్పాటు చేశాం. బస్సుల్లో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించటం, దాడి చేయటం, జేబు దొంగతనాలు వంటివాటితో పాటు కొందరు అనారోగ్యంతో గుండెపోటుకు గురయ్యేవారిని రక్షించేందుకు బస్ మార్షల్స్‌ను అన్ని బస్సుల్లో ఏర్పాటు చేశాం. 13000 బస్ మార్షల్స్‌ను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చాం. మహిళల రక్షణ కోసం బస్సుల్లో ఇలాంటి భద్రత చర్యలు చేపట్టటం ప్రపంచంలోనే మొదటిసారి. దేశంలో దిల్లీలో మాత్రమే ఇలాంటి బస్ మార్షల్స్ ఉన్నారు." - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
140 కోట్ల బడ్జెట్
దిల్లీలో సుమారు 5,600 డీటీసీ, క్లస్టర్ బస్సులు ఉన్నాయి. వీటిలో 10 రూపాయల ముఖవిలువ కలిగి పింక్ టికెట్లను మహిళా ప్రయాణికులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం కోసం దిల్లీ ప్రభుత్వం రూ.140కోట్లు కేటాయించింది.
దిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (డీటీసీ) బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ పథకం ప్రారంభించిన రోజున 4.77 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం కోసం పింక్ టికెట్లు తీసుకున్నారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఐరోపా సమాఖ్య అండ'