బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది దిల్లీ ప్రభుత్వం. విమానాశ్రయంలో దిగిన వెంటనే సొంత డబ్బులతో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. పాజిటివ్‌గా తేలిన వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్త రకం కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
నెగెటివ్‌గా తేలిన ప్రయాణికులు.. 7 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో, మరో 7 రోజులు ఇంట్లో నిర్బంధంలో ఉండాలని పేర్కొన్నారు.
''యూకేలో గుర్తించిన వైరస్ నుంచి దిల్లీ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు విమానాశ్రయానికి చేరగానే సొంత డబ్బులతో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.''
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధాన్ని పొడిగించాలని కేంద్రాన్ని గురువారం కోరారు కేజ్రీవాల్. కొత్త స్ట్రెయిన్ కేసుల కారణంగా.. గతేడాది డిసెంబర్ 23న యూకే నుంచి విమానాలను నిషేధించగా.. జనవరి 8తో గడువు ముగియనుంది.
ఇదీ చూడండి: కలెక్టర్‌కు ఇచ్చిన నీళ్ల సీసాలో విషం!