ETV Bharat / bharat

370 అధికరణ రద్దు..  భావోద్వేగ విలీనం - Eenadu editorial page

జమ్ముకశ్మీర్ అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన 370, 35ఏ అధికరణలను గతేడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి ప్రతిఘటనలు ఎదురైనా.. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు చరిత్రాత్మక బిల్లులను పార్లమెంటులో ఆమోదించారు. భరతమాతకు కుంకుమ బొట్టువంటి జమ్ముకశ్మీరుపై నూతన చరిత్ర లిఖించారు. ఫలితంగా నేడు అక్కడి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని. అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయంటున్నారు కేంద్ర హోశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి.

Kashmir peoples are receiving with emotionally the Govt decision to merge with India
భారత్‌తో భావోద్వేగ విలీనం
author img

By

Published : Aug 5, 2020, 9:15 AM IST

రాళ్లు విసరడాలు లేవు. తుపాకీ కాల్పుల మోతలు పాక్‌ సరిహద్దులకే పరిమితం. ఉగ్రవాదుల వెన్నంటి ఎప్పుడూ మరణభయం ఉంటోంది. భారత త్రివర్ణ పతాకానికి అవమానాలు పాతకాలంనాటి మాట. పాకిస్థాన్‌ జెండాలు కనుమరుగయ్యాయి. జమ్మూకశ్మీరులో శాంతి నెలకొంటోందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. వివిధ గ్రామాల మధ్య రహదారి సౌకర్యాల నిర్మాణం వేగవంతమైంది. వంతెనలు వెలుస్తున్నాయి. కొత్త పాఠశాలలు, కళాశాలలు వస్తున్నాయి. పెద్దయెత్తున వైద్యకళాశాలలూ ఏర్పడుతున్నాయి. రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి, విత్తనాలు వంటివి అందుతున్నాయి. రైతుల ప్రధాన ఉత్పత్తి ఆపిల్‌ పండ్లకు గిట్టుబాటు ధర దక్కుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే- జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌ ప్రాంతాల్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జమ్మూకశ్మీరును భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేయడమే దీనికి కారణం.

ప్రధాని చొరవ

జమ్మూ కశ్మీరు అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన 370 అధికరణ, 35ఏ అధికరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు రద్దు చేశారు. సంబంధిత బిల్లులు పార్లమెంటులో భారీ మెజారిటీతో ఆమోదం పొందాయి. నిరుడు ఆగస్టు అయిదున ఈ రెండు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు పెద్ద గందరగోళమే సృష్టించాయి. బిల్లు పెడితే రక్తపాతం తప్పదంటూ, కశ్మీరీలకు సంబంధించి అనేక భయాలు, ఆందోళనలను వ్యక్తీకరించాయి. కానీ, కశ్మీరీలు కోరుకున్నదాన్నే చేస్తున్నామని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు స్పష్టం చేశారు. తాత్కాలిక సమయం కోసం తీసుకువచ్చిన ఈ రెండు అధికరణలు 70 ఏళ్లుగా జమ్మూ కశ్మీరు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని, మానసిక వైరుద్ధ్యాలకు కారణమవుతున్నాయని వివరించారు.

కొత్త చరిత్ర లిఖితం..

దేశ ప్రజల ఆకాంక్షల మేరకు చరిత్రాత్మక బిల్లులను పార్లమెంటులో ఆమోదించారు. భరతమాతకు కుంకుమ బొట్టువంటి జమ్మూకశ్మీరుపై కొత్త చరిత లిఖించారు. నిప్పుల కుంపటిగా మారి, పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అధికరణ 370 రూపంలోని ప్రత్యేక హోదాను చెరిపేశారు. వేర్పాటుకు ఊతమిచ్చే కశ్మీరీ రాజకీయ పార్టీలు, పాకిస్థాన్‌ దన్నుతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులను నిలువరిస్తూ, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. కశ్మీరీ సమస్య అనే రాచపుండుకు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా శస్త్రచికిత్స చేశారు. నిరుడు అక్టోబరు 31నుంచి ఈ నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. కానీ, జమ్మూకశ్మీరు, లద్ధాఖ్‌ల్లో అభివృద్ధి మాత్రం ఆగస్టులోనే ప్రారంభమైంది. జమ్మూకశ్మీరు, లద్ధాఖ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఉపాధిహామీ పథకం పరుగులు పెడుతోంది.

వాటిపై ప్రత్యేక దృష్టి..

ఏడాదిలో 50మందికిపైగా కేంద్రమంత్రులు జమ్మూకశ్మీరులో పర్యటించారు. ప్రజల నుంచి వందలాది వినతులు స్వీకరించి అత్యధికం పరిష్కరించారు. మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధికల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని 100శాతం స్కూళ్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించారు. ఆడపిల్లలకు నూటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించారు. అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. జమ్మూకశ్మీర్‌లో రెండు ‘ఎయిమ్స్‌’ ఆస్పత్రులతోపాటు అనంత్‌నాగ్‌, బారాముల్లా, రాజౌరీ, దోడా, కథువాల్లో కోట్లాది రూపాయలతో అయిదు కొత్త వైద్యకళాశాలలను కేంద్రం ఏర్పాటు చేసింది. కుప్వారా, ఉధంపూర్‌లకూ మంజూరు చేసింది.

శరవేగంగా అభివృద్ధి పనులు..

ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద జమ్మూకశ్మీరుకు రూ.80 వేలకోట్లు మంజూరు చేసి, రూ.29 వేలకోట్లు వ్యయపరచారు. కొండగుట్టలు, మంచు పర్వతాలతో కూడిన రాష్ట్రంలో రోడ్లు, వంతెనల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాలుగు మార్గాల జమ్ము-ఉధంపూర్‌ రోడ్డు, శ్రీనగర్‌-బనిహాల్‌ రోడ్డు, కలై బ్రిడ్జి వంటి 54 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. వీటిలో 17 ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 31 వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 90వేలమందికి నిర్మించాల్సిన ఇళ్లలో 20 వేలు పూర్తిచేశారు. పట్టణ ప్రాంతాల్లోని 79,331 ఇళ్ల నిర్మాణంలో 54,147 పూర్తయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద దాదాపు 10లక్షల మందికి రైతు సాయం అందుతోంది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 5.31 లక్షల మంది రుణాలు తీసుకుని స్వయంఉపాధిని పొందుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద 22.44 లక్షల మంది నమోదయ్యారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద నూరుశాతం అంటే, 11 లక్షలకు పైగా ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించారు.

ఓడీఎఫ్​గా గ్రామాలు..

గ్రామాలన్నీ ఓడీఎఫ్‌గా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు సంక్షుభితంగా ఉండే బారాముల్లా జిల్లాలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 30 వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉజ్జ్వల యోజన కింద జమ్మూకశ్మీరులోనే 12,60,685 మందికి వంటగ్యాస్‌ ఇచ్చారు. అన్ని రకాల పింఛన్లు కలిపి 7.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. లద్ధాఖ్‌ లోనూ అభివృద్ధి కొనసాగుతోంది. గిరిజనులకు రిజర్వేషన్లను 10 నుంచి 45 శాతానికి పెంచారు. రూ.500 కోట్లతో సేంద్రియ అభివృద్ధి పథకం చేపట్టారు. 165 గ్రామాల్లో వైఫై హాట్‌స్పాట్లు వచ్చాయి. 3.4 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. లద్ధాఖ్‌లోనూ దాదాపు రూ.10 వేలకోట్లతో ప్రధానమంత్రి అభివృద్ధిప్యాకేజీ కింద పనులు కొనసాగుతున్నాయి. దీని కింద ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న జోజిల్లా టన్నెల్‌, కార్గిల్‌-జష్కర్‌ రోడ్డు వంటి పనులు వేగవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తమకు అందుతున్నాయనే సంతోషం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.

యువతకు ఉపాధి

నిరుద్యోగం, నిరక్షరాస్యత కారణంగా గతంలో యువత ఉగ్రవాదంవైపు మొగ్గు చూపేవారు. డబ్బులు తీసుకుని భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేవారు. 2016లో ఏకంగా 2,653 రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. ఇందుకోసం పాకిస్థాన్‌ నిధులు సరఫరా చేసి, ఒక్కొక్కరికి రోజుకు రూ.500 ఇచ్చేదని జాతీయ దర్యాప్తు సంస్థ అధ్యయనంలో తేలింది. అందువల్లే నిరంతరాయంగా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చేది. యువతకు ఉపాధి దొరుకుతుండటంతో ఏడాదిగా రాళ్లు విసిరిన ఘటన ఒక్కటైనా జరగలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలిసారి అభివృద్ధి కార్యక్రమాల నిధులు నేరుగా గ్రామ పంచాయతీ సర్పంచుల బ్యాంకు ఖాతాల్లోకే వెళ్తుండటంతో స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు సాకారమవుతున్నాయి. యువతకు సత్వరం చెల్లింపులు చేస్తున్నారు. దీంతో యువత కూడా అభివృద్ధికే జై కొడుతోంది. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన కింద నిధులు వస్తున్నాయి. ఉచితంగా రేషన్‌ అందుతోంది.

నెరవేరని ఆశలు..

కేంద్రం నిర్ణయాల వల్ల రక్తపాతం జరుగుతుందని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వంటివారు అన్నా- వారి ఆశలు నెరవేరడం లేదు. కశ్మీరీలు తిరగబడతారని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని విమర్శించారు. అందుకు భిన్నమైన పరిస్థితులు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో నెలకొన్నాయి. అక్కడి ప్రజలు మరింతగా భారతదేశంలో మమేకం అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తమకు నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకునే స్వేచ్ఛ వారికి లభించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. భారతదేశంలో కశ్మీరం భావోద్వేగపరంగా విలీనం కావాలన్న శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కల ఇన్నేళ్లకు సాకారమైంది!

- కిషన్​ రెడ్డి, రచయిత - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్‌లో కొత్త కాంతులు.. అభివృద్ధి దిశగా అడుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.